Rashmi Gautam: ఆ బాధ వాళ్ళు కూడా అనుభవిస్తారు... హార్ట్ బ్రేక్ ఘటనతో యాంకర్ రష్మీ ఎమోషనల్

Published : Feb 02, 2022, 06:00 PM IST

బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూ చాలా ఎనర్జిటిక్ గా ఉండే రష్మీ గౌతమ్ వాస్తవంలో చాలా ఎమోషనల్. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమె కన్నీరు పెట్టుకుంటారు. పైకి గంభీరంగా కనిపించినా లోపల చాలా ఎమోషనల్.   

PREV
16
Rashmi Gautam: ఆ బాధ వాళ్ళు కూడా అనుభవిస్తారు... హార్ట్ బ్రేక్ ఘటనతో యాంకర్ రష్మీ ఎమోషనల్

రష్మీ గౌతమ్ (Rashmi gautam) జంతు ప్రేమికురాలు. ముఖ్యంగా కుక్కలను చాలా ఇష్టపడతారు. విశ్వాసం కలిగిన ఆ మూగ జీవాలకు ఎవరైనా హాని చేశారని తెలిస్తే అసలు సహించరు. దేశంలో ఎవరు, ఎక్కడ కుక్కల పట్ల అమానుషంగా ప్రవర్తించినా సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. కుక్కలను బాధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.

26


తాజాగా  బెంగళూరుకు చెందిన ఒక యువకుడు తన అపార్ట్మెంట్ ప్రాంగణంలో కారు నడుపుతూ పడుకున్న కుక్క ను తొక్కించారు. ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. కుక్క మరణానికి కారణమైన ఆ కుర్రాడి ఫ్యామిలీకి వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నాయట. ఐనప్పటికీ పోలీసులు అరెస్ట్ చేశారట. 

36

ఈ ఘటనపై రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'డబ్బుతో వస్తువులు కొనొచ్చు గానీ బుద్దిని, పద్ధతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ మూగజీవి పడ్డ బాధను ఆ కుటుంబమంతా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కలను రాళ్లతో కొట్టడం పిల్లలకు నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇలా తయారవుతారు.' అని రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.

46


ఈవెంట్స్ మీటింగ్స్, షోలు సినిమాలతో బిజీగా ఉండే రష్మీ గౌతమ్ తన విలువైన సమయంలో కొంత భాగాన్ని యానిమల్ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారు. సెలెబ్రిటీ హోదాలో ఉండి జంతు హింస చేయరాదని, ప్రేమించాలని అవగాహన కల్పిస్తున్నారు. మూగజీవాలపై రష్మీ చూపిస్తున్న బాధ్యతకు నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

56


మరోవైపు రష్మీ ఢీ సీజన్ 14 నుండి తప్పుకున్నారు. అలాగే రష్మీ జోడి సుడిగాలి సుధీర్ సైతం ఈ షో వదిలేశారు. జబర్ధస్త్ లో మాత్రం ఇద్దరు కొనసాగుతున్నారు. దశాబ్ద కాలంగా రష్మీ గౌతమ్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. అలాగే హీరో నందు లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో రష్మీ హీరోయిన్. ఆ మూవీ విడుదలకు నోచుకోవడం లేదు. 

66


బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ రోల్ చేశారు. చాలా కాలం క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో వరుస చిత్రాలు చేసిన రష్మీ గౌతమ్ కి ఆ స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ చిత్రంలో రష్మీ ఓ రోల్ చేస్తున్నట్లు సమాచారం. 
 

Read more Photos on
click me!

Recommended Stories