తాజాగా ప్రదీప్ తన వివాహంపై స్పందించారు. తాను వ్యాఖ్యాతగా ఉన్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షోకి గెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె వచ్చారు. కొద్దిరోజులుగా ప్రదీప్ మాచిరాజు పెళ్లి, అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? అనే వార్తలు చూస్తున్నాను, మేటర్ ఏంటని అడిగారు. సమాధానంగా ప్రదీప్... ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నేను కూడా షాక్ అవుతానని టైమింగ్ జోక్ వేశాడు.