తన భర్తతో జీవితం అలా ఉందంటూ అనసూయ క్రేజీ పోస్ట్.. అదిరిపోయే ఫొటో షేర్ చేసిన స్టార్ యాంకర్!

First Published | Feb 14, 2023, 3:01 PM IST

‘జబర్దస్త్’ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వాలెంటెన్స్ డే సందర్భంగా క్రేజీ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తతో జీవితం అలా ఉందంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
 

తెలుగు ప్రేక్షకుల్లో స్టార్ యాంకర్ గా, నటిగా అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. 
 

ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. అనసూయ కేరీర్ లో ఎదిగిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంటుంది. సాధారణంగా పెళ్లి తర్వాత సినిమా రంగానికి యాక్ట్రెస్ దూరంగా ఉంటారు. కానీ అనసూయ అందుకు భిన్నమనే చెప్పాలి. 
 


అనసూయ భరద్వాజ్ 2010లో సుశాంక్ భరద్వాజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనసూయ ఫ్యామిలీతో ఎంతలా టైమ్ స్పెండ్ చేస్తారో తెలిసిందే. భర్త,  పిల్లలను చాలా జాగ్రత్తగానూ చూసుకుంటూ ఉంటారు. ఇటు కేరీర్ పైనా శ్రద్ధ వహిస్తున్నారు. 
 

భర్త, కుటుంబీకుల ప్రోత్సాహానికి తోడు తన టాలెంట్ తోనూ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో రాణిస్తున్నారు. యాంకర్ గా నుంచి  నటిగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అనసూయ. మరోవైపు ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నారు. 
 

ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నారు. వర్కౌట్ దుస్తుల్లో భర్తతో కలిసి అద్దం ముందు క్యూట్ గా సెల్ఫీ ఇచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ తన భర్తతో జీవితం అద్భుతంగా ఉందని తెలిపారు. ‘మీతో జీవితం ఒక క్రేజీ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది సుశాంక్ భరద్వాజ్’ అంటూ భర్తకు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
 

ప్రస్తుతం అనసూయ నటిగా ఫుల్ బిజీ అవుతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రం ద్వారా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా ‘మైఖేల్’లో నటించారు. ప్రస్తుతం ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగమార్తండ’లో నటించారు. 

Latest Videos

click me!