Published : Aug 31, 2021, 01:34 PM ISTUpdated : Aug 31, 2021, 02:10 PM IST
శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ఆనంది గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. గత వారం విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ప్రొమోషన్స్ లో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది.
వరంగల్ కి చెందిన రక్షిత హీరోయిన్ కావాలనే ఆశతో పరిశ్రమకు వచ్చారు. 2012లో విడుదలైన ఈ రోజుల్లో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది.
28
అదే ఏడాది విడుదలైన బస్ స్టాప్ మూవీలో ఆనంది మరో హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు మారుతి కావడం విశేషం.
38
ఆ తరువాత చిన్న చిన్న చిత్రాలలో నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. దీనితో ఆమె కోలీవుడ్ వైపు అడుగులు వేశారు. కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా మారిన రక్షిత, ఆనందిగా పేరు మార్చుకున్నారు.
48
తమిళంలో పది చిత్రాలకు పైగా నటించిన ఆనంది చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ, ఓ మలయాళ చిత్రం ఉంది. చాలా గ్యాప్ తరువాత జాంబి రెడ్డి మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు.
58
ఆ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఆమెకు సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో ఆఫర్ దక్కింది. ఈ సినిమా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
68
తెలుగు, తమిళ్ లో బిజీ అవుతున్న ఈ హీరోయిన్ గర్భం దాల్చారని వార్తలు వస్తున్నాయి. తమిళంలో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆనంది అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ప్రేమలో పడ్డారు.
78
ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, పెళ్ళికి ఒప్పించారు. 2021 జనవరి 7న వరంగల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
88
పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఆనంది గర్భం దాల్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.