సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సమంత... విరామంలో చేస్తున్న పనులు ఇవా?

Published : Aug 31, 2021, 10:47 AM IST

పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తీరిక లేని జీవితం గడిపారు. కెరీర్ బిగినింగ్ నుండి సక్సెస్ ఫుల్ గా ఆమె కెరీర్ సాగగా, షూటింగ్స్ మీటింగ్స్ తో  ఫుల్ బిజీగా ఉండేవారు. అలాంటి సమంత చేంజ్ కోసం సినిమాలకు షార్ట్ బ్రేక్ ప్రకటించారు. 

PREV
16
సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సమంత... విరామంలో చేస్తున్న పనులు ఇవా?

సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ లో నిర్వహించారు. ఇటీవల శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసింది సమంత. ఇక వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటిస్తారని అందరూ భావిస్తుంటే, కొద్దిరోజులు కథా చర్చలలో పాల్గొనేది లేదని, బ్రేక్ తీసుకుంటున్నానని అన్నారు.

26

సమంత సినిమాలకు బ్రేక్ అనగానే అనేక రూమర్స్ తెరపైకి వచ్చాయి. సమంత గర్భవతి కావచ్చని, లేదంటే పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుండగా పిల్లల కోసం ప్లాన్ చేయడానికి ఇలా సినిమాలకు దూరం అయ్యారని అంటున్నారు. 

36


కారణం ఏదైనా బిజీ లైఫ్ నుండి బయటపడి సమంత ప్రశాంతగా గడుపుతున్నారు. మరి ఈ విరామంలో సమంత ఏం చేస్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే సమంత లైఫ్ మనం దగ్గరగా చూడకున్నా, ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి. 
 

46

సమంత ఈ ఖాళీ సమయంలో తన పెట్ డాగ్ యాష్ తో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అలాగే కంటి నిండా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే తన మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. 

56


సమంత పచ్చని పొలాలు,వనాల్లో తిరుగు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆరు బయట పచ్చిక బయళ్ళలో తిరుగుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

66


తన ఫ్రెండ్ శృతి రెడ్డి పిల్లలతో సమంత ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
మొత్తంగా ఈ విరామ సమయాన్ని ఇష్టమైన పనులకు కేటాయిస్తూ, సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. మరి చైతూతో ఏదైనా విహారం కూడా ఆమె ప్లాన్ చేస్తారేమో చూడాలి. 

click me!

Recommended Stories