బిగ్‌ బాస్‌ షో నుంచి శ్రీసత్య అందుకున్న పారితోషికం లీక్‌.. రేవంత్‌, శ్రీహాన్‌లకు సమానంగా పుచ్చుకుందిగా!

Published : Dec 20, 2022, 08:02 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగులో పాల్గొని సందడి చేసింది శ్రీ సత్య. 15 వారాలు హౌజ్‌లో ఉంది. అయితే ఆమె ఈ షోలో పాల్గొన్నందుకు అందుకున్న పారితోషికం వివరాలు లీక్‌ అయ్యాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
బిగ్‌ బాస్‌ షో నుంచి శ్రీసత్య అందుకున్న పారితోషికం లీక్‌.. రేవంత్‌, శ్రీహాన్‌లకు సమానంగా పుచ్చుకుందిగా!

మోడలింగ్‌ నుంచి నటిగా మారి అటు సినిమాల్లో, ఇటు బుల్లితెరపై సీరియల్స్ లో నటించి మెప్పించిన శ్రీ సత్య(Sri Satya) బిగ్‌ బాస్‌ తెలుగు 6వ(Bigg Boss Telugu 6) సీజన్‌లో పాల్గొని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచింది. 15వ వారంలో మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆమె ఎలిమినేట్‌ అయ్యారు. టైటిల్‌ రేసు నుంచి ఒక్క రోజు ముందే ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. 
 

26

కానీ ఎప్పుడో ఎలిమినేట్‌ అవుతుందని భావించిన శ్రీసత్య.. 15 వారాల వరకు ఉండటం అభినందనీయం. ఆమె గ్లామర్ పరంగా, చలాకీతనం, తెలివితో వ్యవహరించడం, మంచి ఫాలోయింగ్‌ ఉండటం, హౌజ్‌లో మేల్ కంటెస్టెంట్లతో కాస్త పులిహోర కలపడం వంటి వాటి కారణంగా చివరి వరకు సస్టెయిన్‌ అయ్యింది. అందరి మనసులను దోచుకుంది. బలమైన లక్ష్యంతో హౌజ్‌లోకి వచ్చిన శ్రీసత్య ఒక్క అడుగు దూరంలో టాప్‌ 5 నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. 

36

అయితే హౌజ్‌లోకి వచ్చేందుకు ఆమె అందుకున్న పారితోషికం వివరాలు లీక్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ షోకి గానూ శ్రీ సత్య గట్టిగానే అందుకుందనేది ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ న్యూస్‌. ఇందులో షో మొత్తంగా ఆయన సుమారు రూ. 34లక్షల వరకు పారితోషికంగా తీసుకుందని తెలుస్తుంది. ఈ లెక్కన ఆమెకి రోజుకి 23వేల వరకు పారితోషికంగా అందుకుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

46

ఒకవేళ ఇదే నిజమైతే బిగ్‌ బాస్‌ 6 విన్నర్స్ రేవంత్‌, శ్రీహాన్‌లకు సమానంగా శ్రీసత్య పారితోషికం అందుకుందని తెలుస్తుంది. వాళ్లకి కూడా రోజుకి 25 వేల వరకు పారితోషికం రూపంలో అందించారని సమాచారం. కాస్త అటుఇటుగా టాప్‌ కంటెస్టెంట్ల రేంజ్‌లో శ్రీ సత్య రెమ్యూనరేషన్‌ అందుకోవడం విశేషం. ఇది సోషల్‌ మీడియా నుంచి అందిన సమాచారం. ఇందులో వాస్తవాలపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

56

ఇక విజయవాడకు చెందిన శ్రీసత్య.. గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకి సినీ, టీవీ ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి. అలా రామ్‌ నటించిన `నేను శైలజ` వంటి చిత్రంలో నటించారు. వీటితోపాటు `ముద్ద మందారం`, `నిన్నే పెళ్లాడతా`, `అత్తారింట్లో అక్క చెళ్లెల్లు` వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ 6తో విశేషంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. 

66

ఇదిలా ఉంటే శ్రీసత్య మదర్‌కి కాళ్లు పడిపోయాయి. కేవలం ఒకే ఒక చేయి పనిచేస్తుంది. తల కూడా కదపలేని స్థితి. ఆమె ట్రీట్‌మెంట్‌కి భారీగా ఖర్చు అవుతుందట. ఆమె ట్రీట్‌మెంట్‌ కోసం బిగ్‌ బాస్‌ షోలో విన్నర్‌గా నిలవాలని వచ్చానని తెలిపింది. కానీ అది సాధించలేకపోయింది. కానీ ఈ షో ద్వారా వచ్చిన పారితోషికాన్ని మదర్‌ ట్రీట్‌మెంట్‌కి ఖర్చు చేయబోతుంది, అలాగే సొంతింటిని కొనుకోబోతుందట శ్రీసత్య. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories