ఇటీవల `అల్లు`గాడి కెరీర్ అయిపోయే టైమ్ వచ్చేసిందని తన సిక్త్స్ సెన్స్ చెబుతున్నట్టుగా తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. తాజాగా అల్లు అర్జున్‌ని డైరెక్టర్‌గా టార్గెట్ చేసింది.
`మహేష్‌బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ రాండ్రోయ్ అని అలా అన్నానో లేదో? మన పుష్పానికి కరోనా వచ్చేసిందట. పాపం రండ్రా మీమ్స్ యేసుకుందాం` అంటూ మరో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.
ఇందులో ఏకంగా అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` చిత్రంలోని పోస్టర్‌ని పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడిది మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల శ్రీరెడ్డి కామెంట్ చేసింది బన్నీని ఉద్దేశించే అనేది కన్ఫమ్ చేసేసింది. అందుకు కింద రిప్లైలో తన భవిష్యవాణికి ఉన్నపవర్ అది మరీ అంటూ చెప్పింది.
మొన్నటి వరకు పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు పెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు బన్నీ ఫ్యామిలీని టార్గెట్ చేయడం షాక్‌కి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సైతం అదే రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీరెడ్డి ఈ ఉచ్చులోకి ప్రభాస్, మహేష్‌లను లాగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ కి బన్నీ బయపడుతున్నట్టుగా శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ అర్థాన్నిస్తుంది.
మమ్మల్ని ఎందుకు లాగుతున్నావంటూ మహేష్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
జనరల్‌గా శ్రీరెడ్డి తన పాపులారిటీ కోసం ఇలాంటి కామెంట్లు చేస్తుందనే నానుడి ఉంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ లు కూడా అదే మాదిరిగా ఉండటం గమనార్హం. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్‌కి కరోనా సోకిన విషయం తెలిసిందే.