ఉగాది వేళ పండగలా దిగివచ్చిన శ్రీముఖి... ఎర్ర ఓణీలో ఏమి హొయలు పోయిందో!

First Published Apr 13, 2021, 3:37 PM IST

ఉగాది పండగ వేళ ఫ్యాన్స్ మదిలో గుబులు రేపింది శ్రీముఖి. సంప్రదాయ వస్త్రాలలో కనువిందు చేసింది. ప్రత్యేక వస్త్రధారణలో పండగలా దిగివచ్చింది ఈ బిగ్ బాస్ భామ.

దుస్తులకు తగ్గట్టుగా ఒంటి నిండా ఆభరణాలు, పర్ఫుల్ కలర్ జాకెట్, ఎర్ర ఓణీ ధరించి పదహారణాల పల్లెటూరి కన్నె పడుచులా తోచింది భామ. ఒద్దికైనా పరువాలతో అందంగా ముస్తాబైంది.
undefined
తెలుగువారి నూతన సంవత్సరాది నాడు, కొత్త లుక్ లో కళకళలాడింది. ఇక తన సోషల్ మీడియా అభిమానులు అందరికీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు.
undefined
శ్రీముఖి ఉగాది విషెష్ కి ప్రతిగా ఫ్యాన్స్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనితో కామెంట్స్ రూపంలో ఆమె ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
undefined
ఇక శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.  స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు. బుల్లితెరపై ఆమె పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
undefined
మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోలు పంచుకుంటున్నారు. శ్రీముఖికి ఉన్న క్రేజ్ రీత్యా ఆమె వీడియోలకు భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఆ విధంగా కొంత సంపాదన అందుకుంటుంది ఈమె.
undefined
ఈ మధ్య సినిమా వేడుకలలో కూడా శ్రీముఖి యాంకర్ గా మెరుస్తున్నారు. తాజాగా పుష్ప టీజర్ విడుదల వేడుకలో శ్రీముఖి యాంకర్ గా బాధ్యతలు నెరవేర్చారు.
undefined
మరోవైపు శ్రీముఖి సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో టీవీ యాంకర్ గా శ్రీముఖి బోల్డ్ రోల్ చేశారని సమాచారం.
undefined
అలాగే సొంతగా వ్యాపారం కూడా మొదలుపెట్టింది శ్రీముఖి. లువా పేరుతో లగ్జరి ఫ్యాషన్ బ్రాండ్స్ స్టోర్స్ చైన్ ని ఆమె స్టార్ట్ చేయడం జరిగింది.
undefined
ఇక 29 ఏళ్ల శ్రీముఖి తనకు 35 ఏళ్ళ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. కాబట్టి మరో ఐదేళ్లు సింగిల్ స్టేటస్ అనుభవించనుంది.
undefined
click me!