Bheemla Nayak: భీమ్లా నాయక్ థియేటర్ లో శ్రీముఖి.. భోళా శంకర్ డైరెక్టర్ తో కలిసి రచ్చ రచ్చ, ఫోటోస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 26, 2022, 09:33 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది.

PREV
16
Bheemla Nayak: భీమ్లా నాయక్ థియేటర్ లో శ్రీముఖి.. భోళా శంకర్ డైరెక్టర్ తో కలిసి రచ్చ రచ్చ, ఫోటోస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది. యూఎస్, బ్రిటన్ దేశాల్లో కూడా పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. 

26

ఇక టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా భీమ్లా నాయక్ చిత్రాన్ని వీక్షించారు. అన్ని ఏరియాల నుంచి ఈ మూవీకి యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. శ్రీముఖి కూడా శుక్రవారం భీమ్లా నాయక్ చిత్రం చూసింది. కానీ ఒక సర్ ప్రైజ్. 

36

తనకు ఫిబ్రవరి 25 మెమొరబుల్ డేగా మిగిలిపోయింది అని శ్రీముఖి తెలిపింది. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

46

'ఈ రోజు అమేజింగ్ డే. మొదట చిరంజీవి సర్ తో కలసి బోళా శంకర్ షూటింగ్ లో పాల్గొన్నా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సర్ భీమ్లా నాయక్ చిత్రాన్ని మెహర్ రమేష్ సర్ తో కలసి చూస్తున్నా' అంటూ శ్రీముఖి థియేటర్ లో రచ్చ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ మెహర్ రమేష్ తో కలసి ఫుల్ హ్యాపీగా భీమ్లా నాయక్ షో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు షేర్ చేసింది. 

56

శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీముఖి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం విశేషమే. 

66

భీమ్లా నాయక్ చిత్రం చూసిన తర్వాత మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. అరుపులు కేకలు, కొడుతూ భీమ్లా నాయక్ మూవీ చూశాను. భోళా శంకర్ డీవోపీ, శ్రీముఖి, ఇతర టీం సభ్యులతో కలసి పవర్ స్టార్ సినిమా చూశాం. టీం మొత్తం థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్, రానా, తమన్ లపై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ సాగర్ చంద్ర వర్క్ ని అభినందించారు. నిర్మాత నాగ వంశీకి అభినందనలు తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories