సుమ, శ్రీముఖిలకు ఝలక్... టాప్ 5 యాంకర్స్ వీరే, లిస్ట్ లో ఆమె ఒక్కదానికే చోటు!

Published : Mar 19, 2024, 03:54 PM ISTUpdated : Mar 19, 2024, 05:57 PM IST

తెలుగు యాంకరింగ్ లో సమీకరణాలు మారిపోతున్నాయి. పాపులారిటీ లెక్కలు తారుమారు అవుతున్నాయి. టాప్ 5 యాంకర్స్ లో సుమ కనకాల, శ్రీముఖికి చోటు దక్కలేదు. మేల్ యాంకర్స్ డామినేట్ చేశారు.   

PREV
15
సుమ, శ్రీముఖిలకు ఝలక్... టాప్ 5 యాంకర్స్ వీరే, లిస్ట్ లో ఆమె ఒక్కదానికే చోటు!
Anchor Suma Kanakala

తెలుగు బుల్లితెరను యాంకర్ సుమ దశాబ్దాల పాటు ఏలారు. చూస్తుంటే ఆమె హవా తగ్గినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. తాజా సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఫిబ్రవరి నెలకు గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ విభాగంలో టాప్ 5లో సుమ కనకాల, శ్రీముఖిలకు చోటు దక్కలేదు. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. 
 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

25


కాగా ఈ లిస్ట్ లో టాప్ లో హైపర్ ఆది కొనసాగుతున్నాడు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఆడియన్స్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. హైపర్ ఆది జబర్దస్త్ మానేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అతడు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ రియాలిటీ షోలో ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. 

35
Top 5 Anchors

రెండో స్థానంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. నిజానికి సుధీర్ బుల్లితెరకు దూరమై చాలా కాలం అవుతుంది. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల నుండి సుధీర్ తప్పుకున్నాడు. హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. అయినప్పటికీ బుల్లితెర ఆడియన్స్ లో అతని క్రేజ్ తగ్గలేదు. 
 

45

అనూహ్యంగా మూడో స్థానంలో ఆటో రామ్ ప్రసాద్ కొనసాగుతున్నాడు. రామ్ ప్రసాద్ జబర్దస్త్ తో పాటు ఢీ షోలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాలుగో స్థానం రష్మీ గౌతమ్ కి దక్కింది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

55
Top 5 Anchors


ఐదవ స్థానంలో ప్రదీప్ మాచిరాజు కొనసాగుతున్నాడు. ఒకప్పుడు ప్రదీప్ నెంబర్ వన్ మేల్ యాంకర్ గా ఉన్నాడు. హైపర్ ఆది, సుధీర్ క్రేజ్ పెరగడంతో ప్రదీప్ రేసులో వెనుకబడ్డాడు. స్టార్ మా లో పలు షోలు చేస్తున్న శ్రీముఖికి టాప్ 5 లో చోటు దక్కలేదు. సుమ కనకాల కూడా టాప్ 5 నుంచి తప్పుకున్నారు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

Read more Photos on
click me!

Recommended Stories