శ్రీముఖి పెళ్లిపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన కమెడియన్‌.. బుల్లితెర రాములమ్మ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రయత్నాలు

Published : May 12, 2024, 06:32 PM ISTUpdated : May 13, 2024, 06:59 AM IST

యాంకర్‌ శ్రీముఖి మూడు పదులు దాటి నాలుగు పదుల్లోకి ఎంటర్‌ అవుతుంది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు.ఈ నేపథ్యంలో గుడ్‌ న్యూస్‌ చెప్పాడు కమెడియన్‌. రచ్చ స్టార్ట్ అయ్యింది.   

PREV
17
శ్రీముఖి పెళ్లిపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన కమెడియన్‌.. బుల్లితెర రాములమ్మ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రయత్నాలు
Sreemukhi

శ్రీముఖి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి యాంకర్‌గా నిలబడింది. నటిగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. బుల్లితెర ఆమెని అక్కున చేర్చుకుంది. ఇక్కడ కూడా స్ట్రగుల్స్ ఉన్నా, తట్టుకుని నిలబడింది. ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా మారింది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గా, అత్యధిక షోస్‌ చేస్తున్న యాంకర్‌గానూ నిలవడం విశేషం. 
 

27
Sreemukhi

శ్రీముఖి ప్రస్తుతం నాలుగైదు షోస్‌ చేస్తుంది. `స్టార్‌ మా పరివార్‌` చేస్తుంది. ఇది ఆదివారం స్టార్‌ మాలో ప్రసారం అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇది. దీంతోపాటు `నీతోనే డాన్స్` షో చేస్తుంది. ఇది డాన్స్ షో. అలాగే `సూపర్‌ సింగర్స్` సింగింగ్‌ షో చేస్తుంది. అలాగే సెలబ్రిటీ గేమ్‌ సో `మిస్టర్‌ మిసెస్`‌ షోతో బిజీగా ఉంది. 
 

37

ఈ షోస్‌ మాత్రమే కాదు, స్పెషల్‌ ఈవెంట్లకి తనే బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఈటీవీ, స్టార్‌ మా, జీ తెలుగు, జెమినీ ఇలా అన్నింటికి కూడా ప్రోగ్రామ్స్ కి తనే హోస్ట్ గా చేస్తుంది. పండగల షోలు కూడా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మూడేళ్ల క్రితం షోస్‌ లేక ఖాళీగా ఉన్న ఆమె ఇప్పుడు తీరిక లేకుండా గడుపుతుండటం విశేషం. ఒకప్పుడు పడ్డ స్ట్రగుల్స్ కి ఇప్పుడు ఫలితాలు దక్కుతున్నాయని చెప్పొచ్చు. 

47
Sreemukhi

శ్రీముఖికి ఇప్పుడు లైఫ్‌ వచ్చింది. దాన్ని వినియోగించుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే పెళ్లి అనే ప్రశ్నలు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా కాలంగా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతుండగా, దాన్ని దాటవేస్తూ వచ్చింది శ్రీముఖి. కెరీర్‌ పరంగా బిజీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఆ వైపు ఆలోచించడం లేదని, అది చేస్తే మాత్రం అందరికి చెప్పి చేసుకుంటా అని వెల్లడించింది. 
 

57

అయితే శ్రీముఖి పెళ్లికి సంబంధించి గుడ్‌ న్యూస్‌ చెప్పాడు కమెడియన్‌ అవినాష్‌. అంజి టాక్స్ లో మాట్లాడుతూ ఈవిషయం చెప్పాడు. శ్రీముఖి, అవినాష్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ల ఇంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఈ క్రమంలో శ్రీముఖి పేరెంట్స్ ఆమెకి సంబంధాలు చూస్తుందట.
 

67
Anchor Sreemukhi

మొన్నటి వరకు నువ్వైనా చెప్పురా పెళ్లి చేసుకోమని అని పేరెంట్స్ తనని అడిగేవారట. కానీ ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని తెలిపారు అవినాష్‌. అంతేకాదు అన్ని కుదిరితే ఈ ఏడాది శ్రీముఖి మ్యారేజ్‌ జరిగే అవకాశం ఉంటుందన్నారు. అందుకు శ్రీముఖి వైపు నుంచి కూడా పాజిటివ్‌ సైన్‌ ఉందని తెలిపాడు.

77
Sreemukhi

దీంతో శ్రీముఖి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఆమె అభిమానుల హార్ట్ మాత్రం బ్రేక్‌ అయ్యే పరిస్థితి నెలకొంది. మరి అవినాష్‌ చెప్పినట్టు శ్రీముఖి ఈ ఏడాది ఆ పెళ్లి తంతు కానిస్తుందా? మళ్లీ వెయిటింగ్‌లో పెడుతుందా అనేది చూడాలి. కాకపోతే ఇది అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories