ఈ సందర్భంగా పెళ్లిపై స్పందిస్తూ ఇప్పటికైనే అదేం లేదని, అంతా బాగానే ఉందని, ఇంకా బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని ఈ పూజ చేయించినట్టు తెలిపింది. ప్రస్తుతం `భోళాశంకర్` నటిస్తున్నానని, పెద్ద సినిమాలు చేస్తానని తెలిపింది. తనకు టీవీ షోస్ మంచి గుర్తింపు తెచ్చాయని, వాటిలోనే బిజీగా ఉన్నట్టు చెప్పిన శ్రీముఖి.. టీవీ షోస్ కారణంగా ఫ్రీ టైమ్ దొరకడం లేదని తెలిపింది. ప్రస్తుతం ఆమె `మిస్టర్ అండ్ మిసెస్`, `స్టార్ మా పరివార్`, `సారంగ దరియా` వంటి షోస్‌తో బిజీగా ఉంది.