ఒక ప్రక్క అనారోగ్యం, అయినా తన వ్యాపారం వదలని సమంత! ఏం చేస్తుందంటే?

Published : Jul 14, 2023, 06:44 PM IST

సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే వేదనలో కూడా సమంత తన వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తుంది.   

PREV
15
ఒక ప్రక్క అనారోగ్యం, అయినా తన వ్యాపారం వదలని సమంత! ఏం చేస్తుందంటే?
Samantha

సమంతకు సాకీ పేరుతో గార్మెంట్స్ బ్రాండ్ ఉంది. ప్రత్యేకించి ఉమెన్స్ వేర్ లభిస్తాయి. ఈ బ్రాండ్ ని చాలా కాలంగా సమంత నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా వచ్చే లాభాలు సమంత చారిటీస్, సోషల్ వర్క్ కోసం ఖర్చు చేస్తారట. తాజాగా సాకీ బ్రాండ్ న్యూ కలెక్షన్ ని ప్రోమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 

 

25

ఒకపక్క సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏడాది పాటు ఆమె సినిమాలు చేయరట. ఈ వార్తల్లో నిజముందా లేదా? అనే ఒక సందేహం ఉంది. నిజమే అంటూ సమంత హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ కన్ఫర్మ్ చేశాడు. చిక్సిత సమయంలో ఆమెకు శక్తి, మనోధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలి. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. 
 

35

మాయోసైటిస్ బారిన పడిన సమంత ఈ ఏడాది ప్రారంభం నుండి యాక్టివ్ గా ఉంటున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు. ఖుషి చిత్ర షూటింగ్  ద్రాక్షారామం షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. ఇక సిటాడెల్ షూటింగ్ జులై 13న పూర్తి చేసింది. ఇక సమంతకు అమెరికాలో జరిగే చికిత్సకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 

 

45

మరోవైపు సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. దశాబ్దానికి పైగా ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్నారు. స్టార్స్ తో జతకడుతూ క్రేజ్  నిరూపిస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం ఆశాజనకంగా లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య దూరమయ్యాడు. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు.
 

55


ఈ పరిణామం సమంతను మానసిక వేదనకు గురి చేసింది. భర్త దూరమైన బాధకు తోడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంతను పలు విషయాల్లో తప్పుబడుతూ కథనాలు వెలువడ్డాయి. విడాకులకు సమంతనే కారణంటూ సోషల్ మీడియా ఆమెను టార్గెట్ చేసింది. ఒక దశ వరకు భరించిన సమంత న్యాయపోరాటం చేసింది. 

click me!

Recommended Stories