శ్రీముఖి పేరు టాటూ వేసుకున్న డై హార్డ్ ఫ్యాన్‌.. `సరిగమప` సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిన హాట్‌ యాంకర్‌

Published : Apr 04, 2022, 02:06 PM IST

శ్రీముఖి యాంకర్‌గా ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. బొద్దు అందాలతో కనువిందు చేసే ఈ హాట్‌ భామకి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఓ వెరైటీ ఫ్యాన్‌తో శ్రీముఖిని సర్‌ప్రైజ్‌ చేశారు. దీంతో రాములమ్మ రియాక్షన్‌ చూడాలి.   

PREV
16
శ్రీముఖి పేరు టాటూ వేసుకున్న డై హార్డ్ ఫ్యాన్‌.. `సరిగమప` సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిన హాట్‌ యాంకర్‌

ఈటీవీ, స్టార్‌మా, జీ తెలుగు వంటి టీవీల్లో అనేక షోస్‌ చేసుకుంటూ వస్తోంది శ్రీముఖి. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. స్టార్‌ యాంకర్‌గా తెలుగులో రాణిస్తుంది. ఇప్పుడు పలు టీవీ షోస్‌తో బిజీగా ఉంది శ్రీముఖి. మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతోనూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

26

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్న షోస్‌లో `జాతిరత్నాలు`, `కామెడీస్టార్స్`, `సరిగమప` ఉన్నాయి. జీ తెలుగులో ప్రసారమయ్యే `సరిగమప` పాటల ప్రోగ్రామ్‌. ఇది చాలా ఏళ్లుగా రన్‌ అవుతుంది. ఎంతో మంది సింగర్స్ ని తయారు చేస్తుంది. ఈ షోలో శ్రీముఖిని సర్‌ప్రైజ్‌ చేశారు నిర్వహకులు, జడ్జ్ గా ఉన్న కోటి. 

36

ఇప్పటి వరకు సింగర్స్ కి సర్‌ప్రైజ్‌లిచ్చాం. ఈ సారి మీకు సర్‌ప్రైజ్‌లిస్తామని తెలిపారు సంగీత దర్శకుడు కోటి. ఆమె కళ్లు మూసుకున్నాక.. ఆమెని అమితంగా ఇష్టపడే ఓ అభిమానిని స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. టెడ్డీ బేర్‌ ధరించిన ఉన్న ఆ అభిమానిని స్టేజ్‌పై శ్రీముఖి ముందు ప్రత్యక్షమై ఆమెని సర్‌ప్రైజ్‌ చేశాడు. 

46

శ్రీముఖికి టెడ్డీ బేర్‌ అంటే ఇష్టమట. ఆల్‌రెడీ ఇంట్లో ఓ టెడ్డీ బేర్‌ ఉందని చెప్పింది. కానీ ఈ కదిలే, మాట్లాడే టెడ్డీ బేర్‌ కొత్తగా వింతగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కట్‌ చేస్తే అతని పేరు తరుణ్‌. శ్రీముఖి విరాభిమాని. ఎంతటి అభిమానో స్టేజ్‌పై వెల్లడించారు. శ్రీముఖిని తల్లిలా భావిస్తారట. ఎందుకు ఇంత ఇష్టమని శ్రీముఖి అడగ్గా, చెప్పడానికి ఒక్క రోజు సరిపోదని  చెప్పడంతో మరింత ఆనందంతో ఉప్పొంగిపోయింది శ్రీముఖి. 

56

ఆమె కోసం ఫోటో ఫ్రేమ్‌ తీసుకొచ్చాడు తరుణ్‌, దీంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని గిఫ్ట్ గా అందించారు. దీంతో మరింత ఆనందానికి లోనైంది హాట్‌ యాంకర్‌. అంతటితో ఆగలేదు ఏకంగా శ్రీముఖి పేరుని తన కుడి చేయిపై టాటూ వేయించుకున్నారు. అమ్మలాంటి మీ కోసం ఏమైనా చేయోచ్చు అని టాటూ వేయించుకున్నానని తెలిపారు తరుణ్‌. దీంతో శ్రీముఖి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

66

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, యాంకర్‌ని కావడం వల్ల తాను ఎక్కువగా రియాక్ట్ కావడం లేదని, టాటూ బాగా టచ్ చేసిందని చెప్పింది. కోటిగారికి, సరిగమప టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది. మనకు అభిమానులుంటారు. కానీ వారిని గుర్తించి, ఇక్కడి వరకు తీసుకొచ్చి కల్పిస్తారు చూడండి, ఈ మూవ్‌మెంట్‌ ఏదైతే క్రియేట్‌ చేస్తారో అది ఎప్పటికీ గుర్తిండిపోతుంది. సరిగమప కేవలం పాటల కార్యక్రమమే కాదు, అన్ని ఎమోషన్స్, లవ్‌ మేళవించిన కార్యక్రమం అని తెలిపింది శ్రీముఖి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories