నిముషానికి అన్ని లక్షలా..? భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీలీల, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఎంతంటే...?

First Published | Sep 13, 2023, 12:25 PM IST

శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదు. సినిమాలు విషయంలోనే కాదు కమర్షియల్స్ విషయంలో కూడా  గట్టిగా డిమాండ్ చేస్తుందట. సినిమాల విషయం సరేసరి.. షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తే.. ఎంత అడుగుతుందో తెలుసా..? 

ప్రస్తుతం టాలీవుడ్ ఓ వినిపిస్తున్న ఏకైక హీరోయిన్ పేరు శ్రీలీల. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు కూడా శ్రీలీలా ఉంటే సినిమా హిట్లు అన్నట్టుగా మారిపోయింది.  ఇండస్ట్రీ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల జపం ఏ రేంజ్ లో చేస్తుందో మన అందరికీ తెలిసిందే. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ కి వచ్చినట్టు అనిపిస్తున్న ఈమె చేతిలో ఇప్పుడు ఏకంగా 12 సినిమాలు ఉన్నాయి. 
 

కృతీ శెట్టి లాంటివారిని పక్కకు నెట్టి.. టాలీవుడ్ ను ఏలేస్తోంది బ్యూటీ. రామ్ లాంటి యంగ్ హీరో సరసన.. రవితేజ లాంటి సీనియర్ హీరో పక్కన కూడా నటిస్తూ.. వారి ఎనర్జీకి ఎదురెళ్తూ.. పర్ఫామెన్స్ తో పాటు.. డాన్స్ విషయంలో కూడా సత్తా చాటుతోంది బ్యూటీ. ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. 
 


ఇక మరో విశేషం ఏంటంటే.. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాల్లో ఆల్ మోస్ట్ శ్రీలీల కనిపించబోతుంది. క్రేజీ మూవీస్ తో స్టార్ మీరోయిన్ గా ఇమేజ్ వచ్చిన శ్రీలీలకు.. ఆటోమాటిక్ గా డిమాండ్ కూడా పెరుగుతుంది కదా.. అందుకే సినిమాకు ఆమె అడిగే రెమ్యూనరేషన్ నెంబర్ ఎప్పటికప్పుడు పెరుగుతుందట. హిట్టు గ్యారింటీ అన్న కాన్ఫిడెంట్ తో.. నిర్మాతలు కూడా ఒకే అనేస్తున్నారట. 

డిమాండ్ కి తగ్గట్టుగానే అమ్మడు రెమ్యూనరేషన్ విషయం లో కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి మూడు నుండి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది. ఇక నెక్ట్స్ చేయబోయే సినిమాలకు..  సంతకం చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ కి 7 కోట్ల వరకూ  రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. 

ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లు కాని.. సీనియర్ తారులు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడం లేదు. ఇది ఇలా ఉండగా కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ఈ బ్యూటీ గట్టిగా సంపాదిస్తోంది.  కమర్షియల్స్ కు కూడా బాగానే లాగుతుందట. తాజా సమాచారం ప్రకారం   షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఈ కుర్ర హీరోయిన్ ఛార్జ్ చేస్తున్న రెమ్యూనరేషన్  విని నోరెళ్ళబెడుతున్నారట. ఇంతకీ ఆమె ఎంత అడుగుతుంది అంటే.. ఒక్క షాప్ ఓపెన్ చేస్తేూ.. 10లక్షలు అడుగుతుందట. 
 

ఈ విషయం ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. అందుతున్న సమాచారం ప్రకారం ఈమె షాపింగ్ మాల్ కి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉంటె పది లక్షల రూపాయిలు ఇవ్వాలట. అలా ఎన్ని ఎన్ని నిముషాలు ఉంటే అన్ని 10 లక్షలు అన్నమాట. దీనితో పాటు ఆమె ఫ్లైట్ ఖర్చులు, భోజనం ఖర్చులు, హోటల్ బిల్స్ ఇలా అన్నీ కూడా సదరు షాపింగ్ మాల్ కి సంబంధించిన యాజమాన్యమే భరించాలట. ఆమెతో పాటు వచ్చే స్టాఫ్ ఖర్చులు కూడా వాళ్ళవే అని సమాచారం. 

 శ్రీలీల వచ్చిందంటే.. అక్కడికి కుర్రాళ్లు ఎగబడతారు.. డిమాండ్ గట్టిగా ఉంటుంది. షాపుకు కూడా ప్లోటింగ్ గట్టిగా ఉంటుంది అందుకే.. ఓనర్లు కూడా ఎంత ఇవ్వాలన్నా వెనకాడటంలేదని తెలుస్తోంది. అంతే కాదు ఈమె చేత షాపింగ్ మాల్ ఓపెన్ చేయించబడితే ఆ షాపింగ్ మాల్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది అనే నమ్మకం ఉంది కాబట్టే శ్రీలీల ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడటంలేదని తెలుస్తోంది. 

Latest Videos

click me!