ఆ స్టార్‌ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేస్తున్న శ్రీలీల.. చాపకింద నీరులా వచ్చి ముంచెస్తుందిగా!

Published : Jun 14, 2023, 03:47 PM ISTUpdated : Jun 15, 2023, 05:09 PM IST

శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది. ఆమె సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న తీరుకి స్టార్‌ హీరోయిన్లు నోరెళ్లబెడుతున్నారు. సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరికి ఈ భామ నిద్ర లేకుండా చేస్తుండటం విశేషం.  

PREV
16
ఆ స్టార్‌ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేస్తున్న శ్రీలీల.. చాపకింద నీరులా వచ్చి ముంచెస్తుందిగా!

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల.. టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన అందాల సునామీ. రెండేళ్ల క్రితం `పెళ్లి సందడి` చిత్రంలో నటించింది. కె రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ పాటలు బాగా హిట్‌ అయ్యాయి. ఇందులో హీరోయిన్‌ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. అందంతోనూ ఆకర్షించింది. అప్పుడు శ్రీలీల గురించి పెద్దగా చర్చలేదు. 
 

26
Sreeleela

కట్‌ చేస్తే రవితేజతో `ధమాకా` చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలైంది. ఇందులో మాస్‌ మహారాజా సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇది గొప్ప కథ కాదు. స్క్రీన్‌ప్లేలో గొప్పగా లేదు. కానీ మాస్‌ కమర్షియల్‌ సినిమాగా ఈ సినిమా హిట్‌ అయ్యింది. అందులో శ్రీలీల డాన్సులు, యాక్టింగ్‌ హైలైట్‌గా నిలిచింది. సినిమా విజయంలో ఆమెదే కీలక భూమిక అని చాలా మంది అన్నారు. అంతగా మ్యాజిక్‌ చేసిందీ భామ. 

36
Sreeleela

చేసింది రెండు సినిమాలే కానీ ఇప్పుడు టాలీవుడ్‌ని శాషించే స్థాయికి వెళ్లింది. సైలెంట్‌గా చాప కింద నీరులా ఒక్కో ఆఫర్‌ దక్కించుకుంటూ, ఏకంగా అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుందీ శ్రీలీల. దీంతో టాలీవుడ్‌ని తన అందంతో, అభినయంతో ఊపేస్తుంది. 

46

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పవన్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, మహేష్‌ `గుంటూరు కారం`, బాలకృష్ణ `భగవంత్‌ కేసరి`, నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, వైష్ణవ్‌ తేజ్‌ `ఆదికేశవ్‌`, రామ్‌, బోయపాటి సినిమా, నితిన్‌ సినిమా, జూనియర్‌, విజయ్‌ దేవరకొండ- గౌతమ్‌ తిన్ననూరి సినిమాలు చేస్తుంది. వీటికి సంబంధించిన శ్రీలీల ఫస్ట్ లుక్‌లన్నీ ఈ రోజు విడుదలయ్యాయి. ఇందులో డిఫరెంట్‌ లుక్స్ లో కనువిందు చేస్తుంది శ్రీలీల. 

56

దీనికితోడు ఓటీటీలో బన్నీతోనూ ఆడిపాడబోతుంది. ఓ ఓటీటీ ఫిల్మ్ లో బన్నీతో కలిసి నటిస్తుంది శ్రీలీల. బర్త్ డే సందర్భంగా నేడే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ లెక్కన ప్రస్తుతం శ్రీలీల చేతిలో తొమ్మిది ప్రాజెక్ట్ లున్నాయి. ఈ బర్త్ డే సందర్భంగా శ్రీలీల చేతిలో తొమ్మిది ప్రాజెక్ట్ లుండటమే కాదు, వాటి నుంచి బర్త్ డే విశెష్‌తో ఫస్ట్ లుక్‌లు, రావడం విశేషం. దీంతో ఇవన్నీ ఆమె ఈ పుట్టిన రోజుని చాలా ప్రత్యేకంగా మార్చాయి. 
 

66

ఇదిలా ఉంటే శ్రీలీల ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ బ్యూటీ రాకముందు రష్మిక మందన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టిల హవా సాగుతుండే. రాశీఖన్నా, కీర్తిసురేష్‌లు కూడా వీరి జాబితాలోనే ఉన్నారు. కానీ వీరంతా ఇప్పుడు పక్కకెళ్లారు. శ్రీలీల దెబ్బకి ఈ బ్యూటీస్‌ ఆఫర్లు లేవు. వీరికి దక్కాల్సిన ఛాన్స్ లన్నీ ఆమెకే వెళ్తున్నారు. ఒకేసారి ఎనిమిది సినిమా ఆఫర్లు ఒక్క హీరోయిన్‌కి రావడం అంటేనే అర్థం చేసుకోవచ్చు, మిగిలిన భామల ఛాన్స్ లను ఈ క్రేజీ బ్యూటీ కొల్లగొడుతుందని, దీంతో చాపకింద నీరులా సైలెంట్‌గా వచ్చి ఇప్పుడు ఈ స్టార్‌ హీరోయిన్లని ముంచేస్తుంది. వారి కెరీర్‌నే ప్రశ్నార్థకంలో పడేస్తుంది. యూత్‌ ఆడియెన్స్ సైతం ఈ భామని కోరుకుంటుండటం, యంగ్‌ హీరోల కూడా ఈ బ్యూటీనే కావాలనుకోవడం విశేషం. మరి ఈ అమ్మడి జోరు ఎంత కాలం నడుస్తుందో చూడాలి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories