Sreeleela: బాలయ్య మూవీ తప్ప అన్నీ ఫ్లాపులే, శ్రీలీల జాతకం ఈ సినిమాతో తేలిపోతుందా ?

Published : Feb 08, 2026, 12:15 PM IST

శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ కోసం శ్రీలీల ప్రమోషన్స్ ప్రారంభించింది. అదెలాగో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
హీరోయిన్ శ్రీలీల

టాలీవుడ్ లోకి యంగ్ బ్యూటీ శ్రీలీల మెరుపులా దూసుకువచ్చింది. రాఘవేంద్ర రావు ఆమెని పెళ్లి సందD చిత్రంతో పరిచయం చేశారు. తన డ్యాన్స్, క్యూట్ లుక్స్ తో శ్రీలీల తెలుగు ప్రేక్షకులని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకా చిత్రంతో శ్రీలీల క్రేజ్ పీక్ కి చేరింది. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ కి యువత ఫిదా అయ్యారు.

25
అన్నీ ఫ్లాపులే

దీనితో వరుస చిత్రాల్లో శ్రీలీలకి ఛాన్సులు మొదలయ్యాయి. యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో శ్రీలీలకి ఆఫర్స్ వచ్చాయి. కానీ ధమాకా తర్వాత శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు అన్నీ ఫ్లాపులే అని చెప్పాలి. 2023 నుంచి శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం. రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, పరాశక్తి ఇలా అన్ని చిత్రాలు నిరాశ పరిచాయి.

35
భగవంత్ కేసరి మాత్రమే

మధ్యలో బాలయ్య కూతురిగా నటించిన భగవంత్ కేసరి ఒక్కటి హిట్ అయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అది. హరీష్ శంకర్ దర్శకుడు. మార్చి 26న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.

45
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

ఈ సినిమాతో శ్రీలీల జాతకం తేలిపోతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీ సాధించే విజయాన్ని బట్టి శ్రీలీల కెరీర్ టాలీవుడ్ ఇంకా ఎంత కాలం ఉంటుంది అని అంచనా వేయొచ్చు అని చెబుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హిట్ కావడం శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నాకి అదే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి కూడా చాలా అవసరం.

55
ప్రమోషన్స్ షురూ

ఉస్తాద్ కోసం ఇప్పటి నుంచే శ్రీలీల ప్రమోషన్స్ ప్రారంభించేసింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన శ్రీలీల అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేసి అభిమానులని అలరించింది. ప్రస్తుతం శ్రీలీల హిందీలో, తమిళంలో కొన్ని అవకాశాలు అందుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories