అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి.. ప్రభాస్ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లపై కృష్ణంరాజు రియాక్షన్

Published : Feb 08, 2026, 07:20 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి ప్రభాస్ పై వస్తున్న రూమర్స్ కి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
ప్రభాస్ వరుస సినిమాలు 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ రిలీజ్ అయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాది స్పిరిట్ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 

25
బాహుబలి సంచలనం 

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి చిత్రంతోనే ఇండియాలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. బాహుబలి చిత్రం సృష్టించిన  సంచలనం అంతా ఇంతా కాదు. అయితే బాహుబలి షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ప్రభాస్ గురించి చెడుగా కొన్ని రూమర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. 

35
అభిమానుల్లో ఆందోళన 

ఆ రూమర్స్ నిజమనుకుని ప్రభాస్ అభిమానులు చాలా కంగారు పడ్డారు. బాహుబలి షూటింగ్ లో ప్రభాస్ కి యాక్సిడెంట్ అయింది అని, చాలా తీవ్ర గాయాలు అయ్యాయి అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కొందరైతే ప్రభాస్ ని వైద్యం కోసం సింగపూర్ తరలిస్తున్నట్లు కూడా మాట్లాడుసుకున్నారు. 

45
పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ 

కానీ ప్రభాస్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే సమయంలో ఓ దివంగత రాజకీయ నేత కుమార్తెతో కూడా ప్రభాస్ కు ఎఫైర్ అంటూ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ కూడా కేవలం పుకార్లు మాత్రమే. ఎలాంటి నిజం లేదు. 

55
సహనం కోల్పోయిన కృష్ణంరాజు 

 ప్రభాస్ గురించి ఇలా లేనిపోనివి కల్పిస్తున్న వారిపట్ల అప్పట్లో కృష్ణంరాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ గురించి కొందరు వెధవలు, సన్నాసులు పుకార్లు పుట్టిస్తున్నారు. అలాంటివారిని అభిమానులే చెప్పుతో కొట్టాలి. ఉదయం కూడా ప్రభాస్ చాలా సంతోషంగా కనిపించాడు. ఇప్పటికీ బాహుబలి షూటింగ్ జరుగుతోంది. అంత పెద్ద సినిమాలో నటిస్తున్నప్పటికీ ప్రభాస్ ఒంటిపై చిన్న గీత కూడా లేదు. ప్రభాస్ లో అలసట ఏమాత్రం లేదు అని కృష్ణంరాజు అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories