చిరంజీవి, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల అభిమానులు వద్దు బాబోయ్ అనుకునే టాప్ 10 వరస్ట్ మూవీస్

Published : Feb 08, 2026, 08:34 AM IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, మహేష్, పవన్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వారందరికీ వారి కెరీర్ లో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అభిమానులు అయితే కొన్ని వరస్ట్ మూవీస్ అస్సలు రిపీట్ కాకూడదు అని భావిస్తారు.  

PREV
111
టాప్ 10 వరస్ట్ మూవీస్ 

ఫ్లాపులు అనేవి అందరు హీరోలకు సహజం. కానీ కెరీర్ కే మచ్చగా మారిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలని ఆ హీరోలు మాత్రమే కాదు, అభిమానులు కూడా మరచిపోలేరు. ఇలాంటి దారుణమైన సినిమాలు జీవితంలో రిపీట్ కాకూడదు అని భావిస్తారు. చిరంజీవి, నాగార్జున, పవన్, మహేష్ ఇలా అగ్ర హీరోలందరికీ వరస్ట్ సినిమాల అనుభవం ఎదురైంది. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

211
చిరంజీవి - భోళా శంకర్

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ కావడం మాత్రమే కాదు.. చిరంజీవిపై ట్రోలింగ్ కి కారణం అయింది. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ నటించారు. 

311
బాలకృష్ణ - ఒక్క మగాడు

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీలో అనుష్క, సిమ్రాన్ నటించారు. తన కెరీర్ లో చెత్త సినిమాల్లో ఇది కూడా ఒకటి అని అనుష్క ఓపెన్ గా చెప్పింది.

411
వెంకటేష్ - షాడో

మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన షాడో మూవీ రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ ని నమ్మి వెంకీ తన ఇమేజ్ కి భిన్నంగా ఈ యాక్షన్ మూవీలో నటించారు. ఫలితం డిజాస్టర్.

511
నాగార్జున - ఆఫీసర్

రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబోలో వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. థియేటర్స్ లో కనీసం ఈ మూవీ ఉందని కూడా ఆడియన్స్ గుర్తించలేదు. వసూళ్లు అంత దారుణంగా నమోదయ్యాయి.

611
పవన్ కళ్యాణ్ - అజ్ఞాతవాసి

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా చేస్తాడని అభిమానులు అస్సలు ఊహించలేదు. భారీ అంచనాలతో వచ్చిన పవన్ అభిమానులకు గుండెల్లో గునపం లాగా గుచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ఈ చిత్రానికి ఎదురైంది. 

711
మహేష్ బాబు - బ్రహ్మోత్సవం

టీవీ సీరియల్ తరహాలో సాగే సినిమా అంటూ బ్రహ్మోత్సవంపై అప్పట్లో ట్రోలింగ్ జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరహాలో శ్రీకాంత్ అడ్డాల మ్యాజిక్ చేస్తాడనుకుంటే మహేష్ కి అట్టర్ ఫ్లాప్ ఇచ్చారు.

811
ఎన్టీఆర్ - శక్తి

ఇది కూడా మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రమే. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ సినిమా దెబ్బతో నిర్మాత అశ్వినీ దత్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

911
ప్రభాస్ - ఆదిపురుష్ 

రామాయణాన్ని కంప్లీట్ గా మార్చేసి ఏదో అద్భుతం చేయాలి అనుకున్న ఓం రౌత్ పప్పులు ఉడకలేదు. పైగా దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని రామాయణ కథతో దారుణమైన సినిమా చేశాడు అనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఈ మూవీలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు.

1011
రాంచరణ్ - తుఫాన్

రాంచరణ్ ఈ చిత్రంతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాంచరణ్ కెరీర్ లో తుఫాన్ మూవీ పరమ చెత్త సినిమాగా నిలిచిపోయింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లఖియా దర్శకుడు. 

1111
అల్లు అర్జున్ - వరుడు

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు మూవీ అన్ని విధాలుగా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories