జాక్‌పాట్‌ కొట్టిన స్పై మూవీ హీరోయిన్...పవన్ కళ్యాణ్ సినిమాలో ఐశ్వర్య మీనన్..?

Published : Jul 01, 2023, 08:54 PM ISTUpdated : Jul 01, 2023, 08:58 PM IST

కొంత మందికి కొన్ని సినిమాలు బాగా కలిసి వస్తాయి. సినిమా హిట్ అయినా లేకున్నా.. పెర్ఫామెన్స్ చూసి అవకాశాలు ఇస్తారు. ఆకోవలోనే లక్కీ ఛాన్స్ కొట్టేసింది  హీరోయిన్ ఐశ్వర్య మీనన్.   

PREV
15
జాక్‌పాట్‌ కొట్టిన స్పై మూవీ హీరోయిన్...పవన్ కళ్యాణ్ సినిమాలో ఐశ్వర్య మీనన్..?

ఆర్టిస్ట్ లకు  అదృష్టం ఏ రూపంలో అయినా రావచ్చు.. పదుల సినిమాలు చేసినా రాని.. లక్కీ ఛాన్స్ ఒక్క సినిమాతో రావచ్చు.. అలాంటి అవకాశం ఈమధ్య శ్రీలీల లాంటి హీరోయిన్లు కొంతమందికి వచ్చింది. కానీ పదేళ్ల కష్టానికి అదృస్టం లేట్ గా వరించింది ఓ హీరోయిన్ కు. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్ని దక్కించుకుంది స్పై మూవీ హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌. 

25

ఎప్పుడో పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చి.. కెరీర్ లో టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తూ ఉంది.. హీరోయిన్ ఐశ్వర్య మీనన్. తాజాగా నిఖిల్ సిద్థార్ధ్  స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ కొట్టింది.  రెండు రోజుల క్రితం విడుదలైన స్పై సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. 

35

అయితే స్పై సినిమాలో హీరో నిఖిల్ నటనను ఎంత మెచ్చుకుంటున్నారో..అంతకు సమానంగా ఐశ్వర్య మీనన్ నటన గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య హీరోయిన్ రోల్ గ్లామర్ కే పరిమితం అవుతుంది. కాని ఈసారి ఏదో సినిమా అన్నాక హీరోయిన్‌ రోల్ ఉండాలి కాదా అనే విధంగా కాకుండా.. స్పై సినిమాలో ఐశ్వర్య పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఉండేలా ఇచ్చారు. ఈ క్యారెక్టర్ కు సినిమాలో  మంచి ఇంపార్టెన్స్‌ ఉంది. 

45

ఆ పాత్రకు 100 శాంతం న్యాయం చేసింది  ఐశ్వర్య.  పెర్పీమెన్స్ లో ఇరగదీసింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తో శభాష్ అనిపించకుంది  ఐశ్వర్య. ఇక ఈసినిమాలో పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారో ఏమో తెలియదు కాని.. ఈ హీరోయిన్ కు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది 
 

55

పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న ఓజీ మూవీలో ఓ కీలకపాత్ర కోసం మూవీ టీమ్  ఐశ్వర్యను సంప్రదించగా.. ఆమె వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుందట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్‌ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో  ఐశ్వర్యకు ఎలాంటి పాత్ర వస్తుంది. ఇందులో నిజమెంత తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories