మేం ద్వైతం కాదు ఏకం.. బాలుతో ఏసుదాసు అనుబంధం.. జానకీకి పాదాభివందనం

సంగీత ప్రపంచంలో గాన గంధర్యులు ఎస్పీబాలసుబ్రమణ్యం, ఏసుదాసు అన్నదమ్ములుగా భావిస్తుంటారు. తాము అన్నదమ్ములం కావడానికి ఒక తల్లికి మాత్రమే పుట్టాల్సిన అవసరం లేదని బాలుని ఉద్దేశించి ఏసుదాసు అంటుండేవారు. మేం ద్వైతం కాదు ఏకమని అంటున్నారు. బాలు కూడా ఏసుదాసుని గురుతుల్యుడిగా, పెద్దన్నయ్యగా భావిస్తారు. 

sp balasubramaniam great relationship with yesudas and janaki arj
వీరి మధ్య అనుబంధం మాటల్లో చెప్పలేనిది. సొంత అనదమ్ముల కంటే ఎక్కువ. బాలుని సొంత తమ్ముడిగా ట్రీట్‌ చేస్తారు ఏసుదాసు. బాలు సహజ గాన గంధర్యుడని అనేక సందర్బాల్లో ప్రశంసించారు కూడా. అయితే వీరి మధ్య సన్నివేశం తెలిస్తే కన్నీళ్ళు ఆగవని చెప్పొచ్చు.
sp balasubramaniam great relationship with yesudas and janaki arj
బాలు గాయకుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడేళ్ళ క్రితం పారిస్‌లో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. అందులో ఏసుదాసు కూడా పాల్గొన్నారు.

అక్కడ ఓ హోటల్‌లో బాలుకి, ఏసుదాసుకి పక్క పక్క గదులను కేటాయించారు. బాలు తన సతీమణితో ఆ టూర్‌లో పాల్గొనగా, ఏసుదాసు ఒక్కరే వచ్చారు. ఆ రోజు సాయంత్రం కచేరీ పూర్తయ్యింది. హోటల్‌కి వచ్చేసరికి అర్థరాత్రి అయ్యింది.
ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ఏసుదాసుకి భోజనం ఏర్పాటు చేయలేదు. హోటల్‌లో ఫుడ్‌ లేదు. దీంతో ఆ ఒక్క రోజు పస్తు ఉండాలని నిర్ణయించుకున్నారు బాలు. తన జీవితంలో పస్తులుండటం కొత్తేమి కాదని, అలానే పడుకుడున్నారు.
అంతలో ఓ రూమ్‌ బెల్‌ మోగింది. ఏసుదాసు డోర్‌ తెరవగానే బాలు చేతిలో భోజనంతో ప్రత్యక్షమయ్యారు. ఆకలితో ఉన్న ఏసుదాసు చలించిపోయారు. బాలు తెచ్చిన రైస్‌, రసంతో కడుపారా భోజనం చేశారు.
ఆ రోజుని తలుచుకుంటూ ఏసుదాసు ఇలా స్పందించారు. `నా తమ్ముడు బాలు తీసుకొచ్చిన ఆ భోజనాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్ని సార్లు భోజనం చేసినా ఆ రోజు చేసిన భోజనానికి సాటి రాదు` అని ఏసుదాసు చెబుతూ, బాలుతో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
సంగీతం రాకపోయినా.. సినిమా పాటలు పాడాలంటూ తనను ప్రోత్సహించి, తన సినీరంగ ప్రవేశానికి కారణమైన ఎస్‌.జానకి అన్నా, శాస్త్రీయ సంగీతంలో అపారమైన పట్టున్న అద్భుత గాయకుడు ఏసుదాసు అన్నా బాలుకు ఎంతో ఇష్టం. కాదు కాదు.. అపారమైన భక్తి. అందుకే ఆయన వారిద్దరికీ ఘన సత్కారం చేశారు. 2018లో నెల్లూరు టౌన్‌ హాల్‌లో ఎస్‌.జానకిని ఘనంగా సత్కరించి, ఆమెకు పాదాభివందనం చేసి ఆమెపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
`బాలు నాకు సోదరుడు మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఒకే గర్భంలో పుడితేనే సోదరుడా? ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము ద్వైతం కాదు ఏకం. సంగీతంతో కలిసి ఉన్నాం. మా తల్లి సరస్వతి` అని చెప్పారు.

Latest Videos

vuukle one pixel image
click me!