అశ్రునయనాల మధ్య బాలు అంతిమ వీడ్కోలు

First Published | Sep 26, 2020, 12:47 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంతిమ సంస్కరాలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం  అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో గౌరవ వందనం చేస్తూ అంత్యక్రియలను పూర్తి చేసింది. మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి.
 

తమిళనాడు, చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా రెడ్‌ హిల్స్ సమీపంలోని బాలు ఫామ్‌ హౌజ్‌ తామరైపాక్కంలో నిర్వహించారు. బాలుని చూసేందుకు భారీగా అభిమానులు అంతిమసంస్కారాలు నిర్వహించే బాలు ఫామ్‌ హౌజ్‌కి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అనుమతించలేదు.
ఇక ఫైనల్‌గా హిందూ సాంప్రదాయ ప్రకారం బాలు భౌతిక కాయానికి చివరి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ పాల్గొన్నారు.

ఆ తర్వాత బాలు భౌతిక కాయాన్ని సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పూడ్చిపెట్టే స్థలానికి తీసుకెళ్లారు. అభిమానులు అభిమాన గాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు కడసారి బాలుని చూసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
లెజెండరీగా గాయకుడు శ్రీపతి పండిరాధ్యుల బాలసుబ్రమణ్యం గత నెల మొదటి వారంలో కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఐసీయూలో, వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. ఆ తర్వాతఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌పొందినట్టు వెల్లడించారు.
కానీ గురువారం మళ్ళీ ఆయనకు మళ్లీ సీరియస్‌ అయ్యిందన్నారు. పరిస్థితి మరోసారి బాలు ఆరోగ్యం విషమించినట్టు, ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటనలో తెలిపారు.చాలా క్రిటికల్‌గా ఉందని తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కానీ బాలు కోలుకోలేదు. ఈ సారి కానరాని లోకాలకువెళ్ళిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04నిమిషాలకు పాటని మనకు వదిలేసి ఆయన గగనానికి వెళ్ళిపోయారు.

Latest Videos

click me!