ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి ముక్కు అవినాష్: హైపర్ ఆది సంచలనం

First Published | Sep 26, 2020, 10:41 AM IST

అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు హైపర్ ఆది. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని ఫన్నీగా చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది.

ప్రారంభమైన అతి కొద్దీ కాలంలోనే అభిమానుల ఆదరాభిమానాలను చూరగొన్న షో బిగ్ బాస్. ఈసారి కూడా ఎన్నో అంచనాలతో ప్రారంభమైన షో... ప్రేక్షకుల ఆదరణను గత సీజన్ల స్థాయిలో చూరగొనలేకపోయింది. దానికి ప్రధాన కారణం కంటెస్టెంట్లు పెద్దగా తెలిసినవారవకపోవడం.
ఇక కంటెస్టెంట్ల విషయం పక్కకుంచితే... ఐపీఎల్ వినోదం మరో ఎత్తు. దాన్ని తట్టుకొని బిగ్ బాస్ వ్యూయర్షిప్ సాధించడం కష్టమైనా పనే. దీనితో మొదటి వారం నుండే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్లాన్ చేసారు నిర్వాహకులు. ఇలా మొదటి వారం హౌస్ లోకి ఎంటర్ అయినవాడే జబర్దస్త్ ఫేమ్ అవినాష్.

ముక్కు అవినాష్ ఎంటర్ అవడంతోనే వినోదాన్ని పంచడం మొదలుపెట్టాడు. సరదాగా ఉంటూ జోకులు వేస్తూ హౌజ్ లోని అందరిని నవ్విస్తూ ఉండడమే కాకుండా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం మొదలుపెట్టాడు. ఇక అవినాష్ బిగ్ బాస్ కి వెళ్లడంతో జబర్దస్త్ లో అతని స్థానం పై ప్రశ్నార్థకత ఏర్పడింది. (Pic Credit: ETV Jabardasth)
బాగానే డబ్బులు వచ్చే జబర్దస్త్ ను కాదని అవినాష్ ఎందుకు బిగ్ బాస్ వైపు చూసాడు అనే అనుమానం అందరికి కలిగింది, కలుగుతుంది కూడా. శ్రీముఖి వంటి యాంకర్ ఈటీవీని వదిలి బిగ్ బాస్ కు వెళ్లిన తరువాత ఆమె ఈటీవీలో కనిపించడమే తక్కువైపోయింది. అలాంటిది అవినాష్ పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు హైపర్ ఆది. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని ఫన్నీగా చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షో లో ఇందుకు గల కారణాన్ని ఆది స్టేజి మీదనే చెప్పేసాడు.
గురువారం ప్రసారమైన జబర్దస్త్ లో హైపర్ ఆది శాంతి జంటగా వంట చేసేవారిగా వేషం వేయగా.... శాంతి, ఎంతకాలం ఇలా వంట చేసుకుంటాము, ఈఎంఐ లో ఒక హౌజ్ తీసుకోవచ్చుగా అని అన్నది. దీనితో వెంటనే ఆది, మనవాడు ఒకడు ఇలా హౌజ్ లకుఈఎంఐలు కట్టలేకే వేరే హౌస్ లోకి వెళ్లాల్సి వచ్చిందని ముక్కు అవినాష్ ను ఉద్దేశించి సెటైర్ వేసాడు. దీనితో అసలు విషయం బయటపడిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. (Pic Credit: ETV Jabardasth)
ముక్కు అవినాష్ లాక్ డౌన్ కి ముందు ఇల్లు కొనుక్కున్నాడు. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవడంతో సంపాదన లేకుండా పోయింది. అలా ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువవాదంతోనే అవినాష్ బిగ్ బాస్ కు వెళ్ళాడు అని చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది.
ఇకపోతే మొన్నటి గురువారం ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ బాగానే పండింది. వెంకీ మంకీస్ తో కలిసి జాయింట్ విన్నర్ గా నిలిచారు. మరోపక్క బిగ్ బాస్ లో ముక్కు అవినాష్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. జబర్దస్త్ ద్వారా ప్రజలకు బాగా తెలిసిన అవినాష్ అక్కడ బాగానే వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటున్నాడు.

Latest Videos

click me!