ఆ తర్వాత సీన్లో స్వప్న, శోభకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. మీరెంత మంచివారు అత్తయ్య అని శోభ స్వప్నని,నువ్వు ఎంత మంచి దానివి అమ్మ అని స్వప్న శోభని ఒకరి గురించి ఒకరు డప్పు కొట్టుకుంటూ ఉంటారు.ఈ లోగ సౌర్య అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ, "ప్రపంచంలోనే అత్యంత ప్రియాతి ప్రియమైన అత్త కోడల్లు లో మీరే ముందుంటారు. ఎంత మంచి అత్త, ఎంత మంచి కోడలు" అని వారిద్దరినీ ఎటకారిస్తూ ఉంటుంది.ఇంటట్లో సత్యం అక్కడికి వస్తాడు.