కాస్త ఘాటుగానే బాలీవుడ్ మీద కామెంట్ చేసింది రవీనా టాండన్. నేల విడిచి సాము చేయడం వల్లే బాలీవుడ్ బాక్సాఫీస్ పోరులో వెనకబడుతోందని సౌత్ జనాలు రూట్స్ ని మర్చిపోరని ,సినిమాతో పాటు కల్చర్ ని , ఎమోషన్స్ ని కూడా మిస్ అవ్వరు, అసలు సినిమాకు కావల్సింది ఎమోషన్స్ ..అవి ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలేకపోతే ..ఎంత పెద్ద సినిమా అయినా కూడా డిజాస్టర్ అవ్వక తప్పదు. ఈ విషయాన్నే బాలీవుడ్ మర్చిపోతోందని , హిందీ సినిమా ఎప్పుడూ హాలీవుడ్ ను ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేస్తూ.. ఫెయిల్ అవుతోందని తీవ్రంగానే విమర్శలు చేసింది రవీనా టాండన్ .