2026 లో 8 సినిమాలతో.. బాక్సాఫీస్ పై హీరోయిన్ దండయాత్ర, నెక్స్ట్ ఇయర్ సందడి చేయబోయే స్టార్స్ వీళ్లే..?

Published : Nov 21, 2025, 04:23 PM IST

South Actresses 2026 Movie Lineup : 2026 చాలా గ్రాండ్‌గా ఉండబోతోంది.  అద్భుతమైన, బ్లాక్‌బస్టర్ సినిమాలు రిలీజ్  కానున్నాయి. ఈ క్రమంలో 2026లో రిలీజ్ కానున్న సౌత్ హీరోయిన్ల మూవీస్ ఏవో తెలుసా? 8 సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అయిన బ్యూటీ ఎవరు? 

PREV
19
శ్రీలీల

సౌత్ లోప్రస్తుతం  శ్రీలీల  టాప్‌లో ఉంది. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని పోటీ పడుతున్నారు.  2026లో ఆమె నటించిన పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. .

29
రష్మిక మందన్న

 వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. 2026లో  'మైసా' అనే సౌత్ సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది రష్మిక హీరో విజయ్ దేవరకొండు పెళ్లి చేసుకునే అవకావం ఉంది. 

39
టాప్ లో నయనతార

సౌత్ స్టార్ సీనియర్  బ్యూటీ నయనతార 2026లో దాదాపు 8 సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అవుతోంది.  డియర్ స్టూడెంట్స్, మన్ శంకర్ వర్ ప్రసాద్ గారు, టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, మన్నన్‌గట్టి సిన్స్ 1960, పేట్రియాట్ సహా 8 సినిమాల్లో  నయనతార నటిస్తోంది. 40 ఏళ్ళు దాటినా తగ్గేది లేదంటోంది లేడీ సూపర్ స్టార్. 

49
కాజల్ అగర్వాల్

పెళ్లి పిల్లల తరువాత కూడా సినిమాల్లో బిజీగా గడిపేస్తోంది  సౌత్ హీరోయిన్  కాజల్ అగర్వాల్ 2026లో ఆమె ఒక సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం 'ఐ యామ్ గేమ్' అనే సినిమాలో నటిస్తోంది, దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

59
తమన్నా భాటియా

సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా భాటియా 2026లో 2 సినిమాల్లో కనిపించనుంది. ఆమె 'మన్ శంకర్ వర్ ప్రసాద్ గారు' సినిమాతో పాటు మరో  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈసినిమాకు టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. ఈరెండు సినిమాలు నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. 

69
పూజా హెగ్డే

పూజా హెగ్డే 2026లో 3 సౌత్ సినిమాల్లో కనిపించనుంది. జన నాయగన్, కాంచన 4తో పాటు మరో  సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. ఈమధ్య వరకూ ఆమె టైమ్ అస్సలు బాలేదు.. వరుసగా ఫెయిల్యూర్స్ చూసిన పూజాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ ఫామ్ లోకి వస్తోంది. 

79
అనుష్క శెట్టి

సౌత్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. అరుంధతి, బాహుబలి సినిమాలతో ఆమె ఓ రేంజ్ లో స్టార్ డమ్ చూసింది. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించేసింది.   అనుష్క శెట్టి 2026లో ఒకే ఒక్క సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా పేరు 'కత్తనార్ ది వైల్డ్ సోర్సెరర్', దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

89
త్రిష కృష్ణన్

సౌత్ లో ఫామ్ లో ఉన్న  హీరోయిన్లలో త్రిష సీనియర్.  42 ఏళ్ల ఈ బ్యూటీ..  2026లో 3 సినిమాల్లో కనిపించనుంది. కరుప్పు, విశ్వంభర, రామ్ సినిమాల షూటింగ్స్ లో త్రిష బిజీగా ఉంది.  వీటిలో 2 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ఒకటి షూటింగ్ జరుపుకుంటోంది.

99
శ్రుతి హాసన్

ఇక సౌత్ స్టార్ హీరోయిన్  శ్రుతి హాసన్ 2026లో 'సలార్ 2' సినిమాతో రానుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories