షాకింగ్ ట్విస్ట్.. డాక్టర్ బాబును వదిలేసి ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయిన వంటలక్క?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 29, 2021, 11:20 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒకటే కథ రకరకాల ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానం లోనే దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
షాకింగ్ ట్విస్ట్.. డాక్టర్ బాబును వదిలేసి ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయిన వంటలక్క?

హిమ, సౌర్య (Hima, Sowrya) ఆనందంగా కలిసి ఆడుకుంటున్న సమయంలో ఆనందరావు చూసి బాగా మురిసిపోతాడు. అప్పుడే ఆదిత్య (Adithya) వచ్చి పిల్లలతో కాసేపు మాట్లాడుతాడు. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇక హిమకు నాన్న మీద కోపం తగ్గిందని సౌర్య చెప్పడంతో సంతోషంగా ఫీల్ అవుతారు.
 

26

అప్పుడే కార్తీక్, సౌందర్య (Karthik, Soundarya)  కూడా ఇంట్లోకి రావటంతో దీప కూడా వారి దగ్గరికి వచ్చి బాధగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లావని అడగొద్దు మామయ్య అంటూ వాళ్లు గుడికి వెళ్లారని మొక్కు ఉందని అందుకే వెళ్లారని దీప (Deepa) కాస్త కొత్తగా మాట్లాడుతుంది. తాము తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టమని అంటుంది.
 

36

కార్తీక్, సౌందర్య మాత్రం ఏమి మాట్లాడకుండా లోలోపల బాగా కుమిలిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్తుండగా దీప (Deepa) వాళ్ళను ఆపి నన్నెందుకు గుడికి తీసుకెళ్లలేదు అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. మరోవైపు హాస్పిటల్ లో మోనిత (Monitha) తన బాబుని చూసి మురిసిపోతుంది. ఇక భారతితో మాట్లాడుతూ తన బాబుకు బారసాల గురించి ఆలోచిస్తున్నానని అంటుంది.
 

46

కార్తీక్ (Karthik) ఒంటరిగా ఉంటూ అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పిల్లలు వచ్చి కాసేపు ఆడుకుందామని అనడంతో దేవుడు నాతో రకరకాల ఆటలు ఆడిస్తున్నాడు అంటూ మనసులో అనుకొని బాధపడతాడు. ఇక ఆనందరావు (Ananda Rao) కార్తీక్ అమెరికా ప్రయాణం గురించి, గుడికి వెళ్లడం గురించి సౌందర్యను  అడగాలనుకుంటాడు.
 

56

అప్పుడే సౌందర్య (Soundarya) వచ్చి తప్పించుకుంటున్నాను.. ఇక తప్పదు అనుకొని ఆనంద రావుతో కాసేపు మాట్లాడి పిల్లల దగ్గర పడుకుంటానని వెళుతుంది. వెంటనే ఆనందరావు (Ananda Rao) మనసులో ఉన్న ప్రశ్నలన్ని అడిగి మొత్తానికి సౌందర్య నుండి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఇక సౌందర్య అన్ని విషయాలు చెప్పటంతో ఆనందరావుకి కాస్త గుండెల్లో నొప్పి వస్తుంది. వెంటనే సౌందర్య ఓదార్చుతుంది.
 

66

మరోవైపు దీప (Deepa) కూడా ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ వచ్చి మాట్లాడుతాడు. దీప మోనిత గురించి అడిగేసరికి కార్తీక్ కోపంతో అరుస్తాడు. మనకంటూ భవిష్యత్ లేదా అని దీపను ప్రశ్నిస్తాడు. తరువాయి భాగంలో సౌందర్య, కార్తీక్ మాట్లాడుతుండగా పిల్లలు వచ్చి అమ్మ కనిపించడం లేదని అంటారు. మొత్తానికి దీప కార్తీక్ (Karthik) నుండి దూరంగా వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి మళ్ళీ కార్తీకదీపం సీరియల్ మొదటికే వచ్చినట్లు అనిపిస్తుంది.

click me!

Recommended Stories