సౌందర్య టూ సాయిపల్లవి.. పొట్టిదుస్తుల్లో కాదు ట్రెడిషనల్‌గానే సంచలనాలు సృష్టించిన స్టార్‌ హీరోయిన్లు..

Published : Sep 07, 2022, 04:28 PM ISTUpdated : Sep 07, 2022, 05:25 PM IST

ఇప్పుడు హీరోయిన్లు అంటే గ్లామర్‌ అనే పదమే ముందుగా వినిపిస్తుంది. కానీ ఒకప్పుడు మాత్రం గ్లామర్‌తో సంబంధం లేకుండా అద్భుతమైన నటనతో స్టార్‌ హీరోయిన్లుగా రాణించారు టాలీవుడ్‌ హీరోయిన్లు. వారిపై ఓ లుక్కేస్తే..   

PREV
111
సౌందర్య టూ సాయిపల్లవి..  పొట్టిదుస్తుల్లో  కాదు  ట్రెడిషనల్‌గానే సంచలనాలు సృష్టించిన స్టార్‌ హీరోయిన్లు..

గ్లామర్‌ని, హీరోయిన్‌ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. హీరోయిన్‌ అంటే అందాలు ఆరబోయాల్సిందే. ఆమెని మరింత హాట్‌గా, పొట్టిదుస్తుల్లో చూపించాలనే దర్శకులు చాలా వరకు భావిస్తుంటారు. హీరోయిన్‌ అంటే స్కిన్‌ షో చేయాలి, మాకు అందాల విందు వడ్డించాలనే ఆశతో ఆడియెన్స్ ఉంటున్నారు. కథానాయికల విషయంలో 90శాతం ఇదే అభిప్రాయంతో చిత్ర పరిశ్రమ రన్‌ అవుతుంది. 

211

కానీ దాన్నీ బ్రేక్‌ చేసిన కథానాయికలున్నారు. అందమంటే పొట్టిదస్తుల్లో కాదు, స్కిన్‌ షో కాదు, చీరకట్టులో, లెహంగా ఓణీలో, ట్రెడిషనల్‌ లుక్‌లో ఉందని, అద్భుతమైన నటనలో ఉందని నిరూపించారు మన టాలీవుడ్‌ కథానాయికలు. సౌందర్య, సుహాసిని, భాను ప్రియ, జయసుధ, శోభన, ఆమని, ఇప్పటితరం సాయిపల్లవి వరకు స్కిన్‌ షోకి దూరంగా ఉంటూ అద్భుతమైన నటనతో, చీరకట్టుతో ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించి స్టార్‌ హీరోయిన్లుగా రాణించారు. ఇప్పటికీ రాణిస్తున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం.

311

సినిమా మొదట్లో హీరోయిన్లు ట్రెడిషనల్‌గానే ఉండేవారు. సావిత్రి, జమున తరంలో గ్లామర్‌ అనేదానికి ఆస్కారం లేదు. చీరలోనే వారంతా అద్భుతాలు సృష్టించారు. కానీ ఆ తర్వాతి తరంలో గ్లామర్‌కి స్కోప్‌ పెరిగింది. హీరోయిన్‌ని పొట్టి బట్టల్లో అందంగా చూపించడం ప్రారంభమైంది. ఆడియెన్స్ కి హీరోయిన్ల అందాలు ఎరగా వేయడం ప్యాషన్‌ అవుతూ వచ్చింది. అలా విజయశాంతి, రమ్యకృష్ణ, రోజా, రంభ, మీనా వంటి హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శన చేసినవారే. 

411

సౌందర్య తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా రాణించింది. అద్భుతమైన హిట్‌ సినిమాల్లో భాగమైంది. స్టార్‌ హీరోలకు దీటుగా స్టార్‌ డమ్ తో రాణించిన సౌందర్య ఏ రోజూ గ్లామర్‌ షో చేయలేదు. ఆమె మోడ్రన్‌ దుస్తులు ధరించినా, ఎప్పుడు హద్దులు దాటలేదు. ట్రెడిషనల్‌ లుక్‌లోనే, చాలా వరకు చీరలోనే సౌత్‌ ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. టాలీవుడ్‌ని ఓఊపు ఊపేసింది. 

511

ఎన్టీఆర్‌,ఏఎన్నార్‌ వంటి మొదటతరం హీరోలతో నటించి మెప్పించిన జయసుధ సైతం చీరలోనే మెప్పించింది. ఆమె 90శాతం సినిమాల్లో చీరలోనేకనిపించింది.అప్పట్లో ఆమె తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. జయప్రద, శ్రీదేవి వంటి కాంపీటీటర్స్ ఉన్నప్పటికీ ఏ రోజు హద్దులు దాటలేదు జయసుధ. సహజనటిగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుని టాలీవుడ్‌ ని కొన్నాళ్లపాటు శాషించింది.
 

611
Suhasini

సుహాసిని అంటే మన ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంది. హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. సహజమైన అందం ఆమె సొంతం. తెలుగుతోపాటు ఎన్నో సౌత్‌ మూవీస్‌లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ని అనుభవించింది సుహాసిని. అగ్రహీరోలందరితోనూ కలిసి నటించిన ఆమె ఏ రోజు అందాల ఆరబోతకు సిద్ధపడలేదు, హద్దులు దాటలేదు. చీరకట్టులోనే అందంగా కనిపిస్తూ కనువిందు చేసింది. 
 

711

వీరి జాబితాలో శోభన కూడా ఉంటారు. ఆమెకి, చీరకిపెట్టింది పేరు అనేలా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. స్వతహాగా క్లాసికల్‌ డాన్సర్‌ అయిన శోభన ఏనాడు స్కిన్‌షోకి పోలేదు, వల్గారిటీకి తావులేకుండా ఫ్యామిలీ కథా చిత్రాల్లో నటించి మెప్పించింది. చీరకట్టులో తెలుగు ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. అద్భుతమైన నటన ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. 

811

భాను ప్రియసైతం సహజమైన అందంతో కనువిందు చేసింది. తెలుగు, తమిళంలో 155కిపైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన భాను ప్రియా సైతం చాలా వరకు చీరకట్టులోనే మెరిసింది. అడపాదడపా వెస్ట్రన్‌ దుస్తులు వేసినా హద్దులు మీరలేదు. అద్భుతమైన యాక్టింగ్‌తో మెస్మిరైజ్‌ చేసింది. 

911

ఆమని అంటే మనింట్లో అమ్మాయిలా కొన్నేళ్లపాటు టాలీవుడ్‌ని శాసించింది. ఇప్పటికీ అమ్మగా అలరిస్తూనే ఉంది.ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమని చాలా వరకు చీరలోనే కనిపించింది. గ్లామర్‌కి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించడం విశేషం. 

1011

హోమ్లీ బ్యూటీ స్నేహ సైతం గ్లామర్‌కి దూరంగానే ఉన్నారు. సహజమైన అందంతోనే కట్టిపడేసింది. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా, హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. పక్కింటి అమ్మాయిగా అలరించింది. ఏనాడూ గ్లామర్‌కి పోకుండా చీరకట్టులోనే ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనువిందు చేసింది స్నేహ. 

1111
Sai Pallavi

ఇప్పటి తరంలో గ్లామర్‌కి దూరంగా ఉన్న హీరోయిన్లు చాలా అరుదుగానే ఉన్నారని చెప్పొచ్చు. నిత్యా మీనన్‌ కొంత ఉన్నా,ఆమె ఒడిదుడుకులతో కెరీర్‌ సాగుతుంది. కానీ సాయిపల్లవి మాత్రం చీరకట్టులోనే సౌత్‌ని ఊపేస్తుంది. ముక్యంగా హాఫ్‌ శారీలో సాయిపల్లవి చేసే సందడి అంతా ఇంతా కాదు. లేడీ పవర్‌ స్టార్‌ ట్యాగ్‌తోనూ విపరీతమైన క్రేజ్‌తో రాణిస్తుంది. స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూనే ఇంతటి క్రేజ్‌ని సొంతం చేసుకోవడ విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories