karthika Deepam: అదిరిపోయే ట్విస్ట్.. తాడికొండ గ్రామంలో మోనిత.. కార్తీక్, దీప ఇంట్లో సౌందర్య?

Navya G   | Asianet News
Published : Feb 09, 2022, 12:02 PM IST

karthika Deepam: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం (karthika Deepam) సీరియల్ రోజురోజుకీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. దీప, హిమ కోసం రుద్రాణి కాళ్లు పట్టుకుంటా ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య (soundarya) వచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది.

PREV
15
karthika Deepam: అదిరిపోయే ట్విస్ట్.. తాడికొండ గ్రామంలో మోనిత.. కార్తీక్, దీప ఇంట్లో సౌందర్య?

 నా కొడుకు ఎవరో తెలుసా.. ప్రముఖ కార్డియాలజిస్ట్.. కొన్ని వందల మందికి గుండె ఆపరేషన్ లు చేశాడు అని సౌందర్య చెబుతుంది. కొన్ని వందలమంది నా కొడుకు పేరు వింటే చేతులెత్తి మొక్కుతారు అని రుద్రాణి (Rudrani)కీ చెప్పగా రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా కొడుకు అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తారు అని చెబుతుంది.
 

25

 వందల కోట్లకు వారసుడు నా కొడుకు అంటూ రుద్రాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సౌందర్య. అనంతరం ఏంటి దీప అంటూ దీప (Deepa) ని నిలదీస్తుంది. ఇక అరుంధతి చూసి కార్తిక్ (Karthik)ఎమోషనల్ గా నిలబడి ఉండి పోతాడు. అనంతరం 10 లక్షల రూపాయల చెక్కును రుద్రాణి కీ ఇస్తుంది సౌందర్య.
 

35

 మరొకవైపు సౌర్య (sourya) దీప, కార్తీక్ కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇక సౌర్య, సౌందర్య ని చూసి ఎమోషనల్ అవుతుంది. సౌర్య కి బాగోలేదు అని హిమ  (hima) చెబుతుండగా మధ్యలో కార్తీక్ అడ్డుపడతాడు.అప్పుడు అత్తయ్య ఏమి కాలేదు.. చిన్న హెల్త్ ప్రాబ్లం అని చెబుతుంది.
 

45

 అనంతరం సౌందర్య కార్తీక్, దీప లను ఎందుకు ఇంటి నుండి వచ్చేసారు అంటూ నిలదీస్తుంది. కార్తీక్ వాళ్ళు ఉన్న ఇల్లు చూసి ఏంటి మీకు ఈ కర్మ అనే అరుగుతుంది. అన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఇలా బతకాల్సిన అవసరం ఏముంది అంటూ నిలదీస్తుంది. అప్పుడు దీప, కార్తీక్ లు మౌనంగా ఉండి పోతారు.
 

55

మరొకవైపు మోనిత (Monitha) భారతి తాడికొండ గ్రామానికి చేరుకుంటారు. కార్తీక్ ఇక్కడ లేరు అని భారతి అనగా లేదు ఇక్కడే ఉన్నారు అంటూ మోనిత మొండి పట్టు పడుతుంది. మన ఇంటికి వెళ్లి పోదామా కార్తీక్..సౌందర్య అడగగా, నేను రాలేను మమ్మీ అంటూ కార్తీక్ సమాధానం ఇస్తాడు. ఎందుకు అని కారణం అడగగా కార్తీక్ మౌనంగా ఉండి పోతాడు. రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి మరి..

click me!

Recommended Stories