సోనూ సూద్‌కి ఐరాస అరుదైన పురస్కారం.. దేశ వ్యాప్తంగా ప్రశంసలు

First Published Sep 29, 2020, 5:42 PM IST

సోనూ సూద్‌.. లాక్‌డౌన్‌ టైమ్‌లో మీడియాలో, సోషల్‌ మీడియాలో మారుమోగిన పేరు. వేల మంది కార్మికులను ఆదుకున్నారు. తిండిలేక అలమటించిన వారికి ఫుడ్‌ పెట్టి చేరదీశారు. వారిని సురక్షితంగా తమ ఊర్లకి పంపించారు. అదే సమయంలో సాయం కోరిక వారికి సాయం చేస్తూ గొప్ప మనసుని చాటుకున్నారు. 

సినిమాల్లో విలన్‌గా పాపులర్‌ అయిన సోనూ సూద్‌.. రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యారు. నిజమైన హీరో అయ్యారు. గొప్ప మనసున్న మనిషి అయ్యాడు. దిక్కులేని వారికి భరోసా అయ్యాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు.
undefined
కరోనా కారణంగా, లాక్‌ డౌన్‌ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కునేందుకు ఓ యాప్‌ని కూడా లాంఛ్‌ చేశాడు. ఇలా అనేక సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు సోనూసూడ్‌.
undefined
ఆయన చేసిన సేవలకు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దాని అనుబంధ సంస్థ అయిన యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ) సోనూ సూద్‌ని స్పెషల్‌ హ్యుమనిటేరియన్‌ యాక్షన్‌ అవార్డుని ప్రదానం చేసింది.
undefined
అతి కొద్ది మందికి అందించే ఈ పురస్కారం సోనూ సూద్‌కి దక్కడం విశేషం. ఇప్పటి వరకు ఎంజేలినా జోలీ, డేవిడ్‌ బెక్‌ హామ్‌, లియోనార్డో డికాప్రియో, ప్రియాంక చోప్రా, ఎమ్మా వాట్సన్‌, లియామ్‌ నీసన్‌, డేవిడ్‌ బెక్హాం వంటి ప్రముఖులు ఈ అవార్డుని అందుకున్నారు.
undefined
సోమవారం జరిగిన వర్చువల్‌ వేడుకలో సోనూ సూడ్‌ ఈ అవార్డుని అందుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ అరుదైన గౌరవం తనకు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైనదన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో యూఎన్‌డీపీకి తన మద్దతు ఉంటుందన్నారు.
undefined
ఇక ఇటీవల తెలుగు సినిమా `అల్లుడు అదుర్స్` షూటింగ్‌లో పాల్గొన్నసోనూ సూడ్‌ తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు శ్రీనువైట్ల విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన ఆయన సోమవారం ఆర్‌ఎఫ్‌సీలో మొక్కలు నాటారు.
undefined
కరోనా తర్వాత పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్‌ ఛాలెంజ్‌లు స్వీకరిస్తూ మొక్కలు నాటాలని చెప్పారు.
undefined
ప్రస్తుతం సోనూసూడ్‌ తెలుగులో `అల్లుడు అదుర్స్ `తోపాటు హిందీలో `పృథ్వీరాజ్‌`, తమిళంలో `తమిలరాసన్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. మరికొన్ని చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి.
undefined
click me!