హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది శృతిహాసన్. ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవడంతో పాటు గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పంచుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.