నేనైతే గుద్ది పడేసే వాడిని.. అమర్ దీప్ కారు ధ్వంసంపై సోహైల్ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 20, 2023, 11:13 AM IST

కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ని ఉల్టా పల్టా అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ప్రస్తుతం వివాదాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి.

PREV
16
నేనైతే గుద్ది పడేసే వాడిని.. అమర్ దీప్ కారు ధ్వంసంపై సోహైల్ సంచలన వ్యాఖ్యలు

కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ని ఉల్టా పల్టా అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ప్రస్తుతం వివాదాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి. రసవత్తరంగా సాగిన సీజన్ 7లో చివరకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. 

 

26

బుల్లితెర నటుడు అమర్ దీప్ రన్నరప్ గా నిలవగా శివాజీ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. హౌస్ లో జరిగిన సంఘటనలు కేవలం గేమ్ లో భాగం మాత్రమే. కానీ అభిమానులు ఆ గోడలని విడిచిపెట్టకుండా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేలా రచ్చ చేశారు. 

 

36

పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కారు అద్దాలని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమర్ దీప్ కారులో తాన్ కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో అభిమానులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. 

 

46

అమర్ దీప్ కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం వరకు ఈ వివాదం వెళ్ళింది. ఫ్యాన్స్ చేసిన అతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అమర్ దీప్ మాట్లాడుతూ తనతో మాత్రమే గొడవ పెట్టుకోవాలంటే ఎంత దూరం అయినా వస్తానని.. కుటుంబ సభ్యులని లాగవద్దని చెప్పాడు. ఫ్యాన్స్ చేసిన అతిని పలువురు సెలెబ్రిటీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

 

56

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు సోహైల్ ఈ వివాదంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం కాదు. అమర్ ని వాళ్ళ అమ్మని, భార్యని నోటికొచ్చినట్లు తిట్టి కారుపై అటాక్ చేశారు. తల్లి దండ్రులని భార్యని అంటే ఎవరూ సహించరు. నేను కనుక ఆ ప్లేస్ లో ఉండిఉంటే కారుతో గుద్దిపడేసేవాడిని. ఆ తర్వాత ఏం జరిగితే అది జరగని అని అనుకునేవాడిని. 

 

66

అమర్ దీప్ చాలా మంచోడు. సైలెంట్ గా వెళ్ళిపోయాడు. నేను అంత మంచోడిని కాదు. నా జోలికి రండి కానీ నా ఫ్యామిలీ జోలికి రావద్దని కూడా అమర్ చెప్పాడు. ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయడం ఎందుకు అని సోహైల్ ప్రశ్నించాడు. షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ స్నేహితుల్లాగా ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పంచాయతీ లన్ని అక్కడే మరచిపోతారు. మేము కూడా అలాగే చేశాం. కానీ చివరికి పిచోళ్లు అయ్యేది ఇలాంటి ఫ్యాన్స్ మాత్రమే అంటూ సోహైల్ కౌంటర్ ఇచ్చారు.  

 

click me!

Recommended Stories