పోలీసుల సూచనలు ఖాతరు చేయకుండా పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. పల్లవి ప్రశాంత్ రావడంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్ల అద్దాలు పగలకొట్టారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల మీదకు రాళ్లు రువ్వి ప్రాపర్టీ నాశనం చేశారు.