సుమ కనకాల యాంకర్లకు ఒక రకంగా జేజమ్మ అని చెప్పచ్చు.. ఈమధ్య కాస్త జోరు తగ్గినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సమకు. తాజాగ సుమ ఓ విషయంలో ట్రోలింగ్ కు గురవుతుందట. ఇంతకీ ఏ విషంలో అంటే..?
Suma Kanakala is the highest paid anchor in South cinema
సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. యాంకరింగ్ అనే పదానికిబ్రాండ్ అంబాసిడర్ ఆమె. ఏ ఇంటర్వ్యూ అయినా.. సినిమా ఫంక్షన్ అయినా.. అది సక్సెస్ అవ్వాలి అంటే .. సుమ ఉండాల్సిందే. అవ్వడానికి మలయాళి అయినా తెలుగులో అనర్గలంగా మాట్లాడగల సుమ.. తాజాగా ట్రోలింగ్ కు గురవుతుందట ఎందుకంటే..?
26
దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుంది సుమ. యాంకరింగ్ రంగంలోకి ఎంత మంది కొత్తవారు వచ్చినా.. ఆమె స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. సినిమా వేడుకలకు కూడా ఈమె యాంకరింగ్ చేస్తేనే అందం.సుమ యాంకర్ గా చేసిందంటే..అంటే ఆ సినిమా మంచి ప్రమోషన్ జరిగినట్టే.. అంతే కాదు మూవీపై మంచి క్రేజ్ కూడా ఏర్పడుతుంది అనేది మేకర్స్ నమ్మకం.
36
ఇక ఈ మధ్య సుమ జోరు తగ్గింది.. కాని సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా రూమర్స్ స్పర్డ్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె తన భర్త రాజీవ్ తో విడాకలు తీసుకోబోతోంది. అందుకే విడిగా ఉంటున్నారు అంటూ రూమర్స్ గట్టిగా వ్యాపించాయి. అయితే ఇందులో నిజం లేదు అని ఆమె కొట్టిపడేసింది.
46
ఈ వార్తలు పెరుగుతుండటంతో.. టైమ్ దొరికితే చాలు తన భర్తతో కలిసి ఫోటోలు ..వీడియోలు చేసి..నెట్టింట్లో పెట్టేస్తోంది. ఇక ఎలాంటి గాసిప్స్ కు ప్లేస్లే లేకుండా జాగ్రత్త పడుతుంది సుమ. ఇక ఈమధ్యఎక్కువగా తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్న సుమ. తాజాగా కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళు..ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు.
56
అయితే వాటిపై జనాల్లో వ్యతిరేకత వస్తోంది... అవి వాడామని.. అవి మంచివి కాదని, డెలివరీ చేసే లోపే పాడైపోతున్నాయని, ప్యాకింగ్ కూడా సరిగ్గా ఉండటం లేదని కామెంట్లు పెడుతున్నారు. అయినా సరే వాటిని ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ సుమపై ట్రోల్ చేస్తున్నారు.
66
Suma Kanakala
అంతే కాదు ఇప్పటికే చాలా సంపాదించారు కదా.. ఇక డబ్బు కోసం ఇలాంటివి ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలా చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుమ కరోనా టైం నుండి ఆ సంస్థ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉంది.