ట్రాన్స్ ఫరెంట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ పోజులిచ్చిన శృతి హాసన్‌.. కాన్స్ రెడ్‌ కార్పెట్‌లో హోయలు పోతూ రచ్చ

Published : May 23, 2023, 10:22 AM ISTUpdated : May 23, 2023, 02:05 PM IST

శృతి హాసన్‌ మరోసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ వేడుకలో ఇండియన్‌ తారలు సందడి చేస్తున్నారు. తాజాగా శృతి రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. 

PREV
17
ట్రాన్స్ ఫరెంట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హాట్‌ పోజులిచ్చిన శృతి హాసన్‌.. కాన్స్ రెడ్‌ కార్పెట్‌లో హోయలు పోతూ రచ్చ

శృతి హాసన్‌ మరోసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌-2023లో పాల్గొంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవ వేడుకలో ఇండియన్‌ భామలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్‌, మృణాల్‌ ఠాకూర్‌ వంటి హీరోయిన్లు సందడి చేశారు. ఇప్పుడు శృతి హాసన్‌ సైతం హల్‌ చల్‌ చేసింది. 

27

సోమవారం సాయంత్రం ఆమె రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది శృతి. సాధారణంగా ఆమెకి బ్లాక్ అంటే ఇష్టం. ఎక్కువగా బ్లాక్‌ ని ఇష్టపడుతుంటుంది. తాజాగా కాన్స్ వేడుకలోనూ బ్లాక్‌ డ్రెస్‌ ధరించి మంత్రముగ్దుల్ని చేసింది. పలుచని డ్రెస్‌లో హాట్‌ అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది. 
 

37

ట్రెండీ వేర్‌లో శృతి సూపర్‌ హాట్‌గా ఉంది. ఆమె హాట్‌నెస్‌ మరింతగా పెరిగింది. ఆమె చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. ఏంజెల్‌లా పోజులిస్తూ హోయలు పోగా, ఆమె అందాలను బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. శృతి అందాలు బంధించేందుకు కెమెరాలు పోటీ పడటం విశేషంగా చెప్పొచ్చు. 
 

47

రెడ్‌ కార్పెట్‌ ఫోటోలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది శృతి హాసన్‌. రెడ్‌ కార్పెటే అయినా, దాన్ని బ్లాక్‌ చేయండి అంటూ పేర్కొంది. ఇక ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ శృతి హాసన్‌ అందంపై కామెంట్లు చేస్తున్నారు. ఆకాశం నుంచి దిగివచ్చిన ఏంజెల్‌ నువ్వు అని, బ్లాక్‌ కిల్లర్‌ అని, కిల్లర్‌ పోజులు అని, బాబోయ్‌ ఇది టూ హాట్‌ అని, సెక్సీ బ్యూటీ అని, కాన్స్ లో అయినా తగ్గేదెలే అని కామెంట్లు చేస్తున్నారు. 

57

గతంలో 2017లో తొలిసారి కాన్స్ రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది శృతి హాసన్‌. అప్పుడు కూడా బ్లాక్‌ డ్రెస్‌లోనే కనువిందు చేసింది. ఇప్పుడు మరోసారి ఆమెకి కాన్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది. క్రమంగా ఇండియన్‌ హీరోయిన్లకి అవకాశాలు పెరుగుతున్నాయని, ఇండియన్‌ సినిమాకి దక్కుతున్న గౌరవంగా దీన్ని చెప్పొచ్చు. 

67

శృతి హాసన్‌ అత్యంత సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి. ఇటీవలే సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చింది. `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రెండు విజయాలను అందుకుంది. ఇప్పుడు ప్రభాస్‌తో `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్‌లో రాబోతుంది. 
 

77

దీంతోపాటు మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది శృతి హాసన్‌.. నానితో మొదటి సారి కలిసి నటిస్తుంది. `నాని30`లో ఆమె కూడా నటిస్తుంది. అయితే శృతిది ఇందులో కీలక పాత్రనా? లేక మరో హీరోయిన్‌గానా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories