Kurchi Thatha: సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత ఇక లేరు. వడదెబ్బ కారణంగా ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఈ విషాదానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
కొందరు ఫేమస్ కావడానికి ఎన్నో ఏళ్ళ సమయం అవసరం లేదు. క్షణాల్లో ఫేమస్ అవుతుంటారు. అలాంటి వారిలో కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా ఒకరు. సోషల్ మీడియాలో కుర్చీ తాతగా ఆయన పాపులర్ అయ్యారు. కుర్చీ మడతబెట్టి అనే డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కుర్చీ తాత గురించి విషాదకర వార్త వచ్చింది. ఆయన ఇక లేరు. బుధవారం రోజు అకస్మాత్తుగా మరణించారు.
23
వడదెబ్బ వల్లే విషాదం
కుర్చీ తాత వడదెబ్బ కారణంగా మరణించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కుర్చీ తాతకి ఎంతో సన్నిహితంగా ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లు యొన్సర్ వైజాగ్ సత్య ఈ విషాదంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. వడదెబ్బ కారణంగా కుర్చీ తాత మరణించినట్లు వైజాగ్ సత్య తెలిపారు.
33
గతంలో పుకార్లు, కానీ ఈ సారి నిజంగానే విషాదం
కుర్చీ తాత హైదరాబాద్ లోని కృష్ణా నగర్ లో ఉంటున్నారు. ఈ సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. అక్కడే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. కుర్చీ తాత మరణించాడని తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు. కుర్చీ తాత చెప్పిన కుర్చీ మడతబెట్టి అనే మాటతో ఏకంగా మహేష్ బాబు సినిమాలో అదిరిపోయే సాంగ్ ని పెట్టారు. ఆ సాంగ్ లో తన డైలాగ్ పెట్టినందుకు థమన్ తనకి రూ లక్ష ఆర్థిక సాయం చేసినట్లు కుర్చీ తాత తెలిపారు. అయితే మహేష్ బాబుని కలిసే అవకాశం మాత్రం రాలేదని అన్నారు. నిన్న మే 19నే తాను కుర్చీ తాతతో మాట్లాడానని వైజాగ్ సత్య అన్నారు. మందు తాగాలని అడిగారు నేను ఒప్పుకోలేదు. మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చాను. సగం మాత్రమే తాగారు. ఆయనతో చివరగా మాట్లాడడం అదే అని వైజాగ్ సత్య తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా కుర్చీ తాత మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వార్తలు ఫేక్. అయితే ఈ సారి మాత్రం ఆయన మరణం నిజంగానే సంభవించింది.