హీరోయిన్ శోభితా దూళిపాళ కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని ఏర్పర్చుకుంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ద్వారా సినిమాకి పరిచయం అయ్యింది. అటు హిందీ, ఇటు తెలుగు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. అయితే ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఏది పడితే అది చేయడం లేదు. సినిమాలో దమ్ము, పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తుంది. అలా ఉంటే తన పాత్ర ఎంతటి బోల్డ్ గా ఉన్నా చేయడానికి రెడీ అంటోంది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శోభితా దూళిపాళ ఇప్పుడు పెళ్లి పీఠలెక్కుతుంది. మరి కొద్ది గంటల్లో ఆమె పెళ్లి జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 4) రాత్రి 8.13 గంటలకు శోభితా పెళ్లి హీరో నాగచైతన్యతో జరగబోతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అతికొద్ది మంది సినిమా సెలబ్రిటీ, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందట.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. నాగచైతన్యకిది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. 2017లో సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోయారు. ఇప్పుడు శోభితాని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. వీరిదీ ప్రేమ పెళ్లినే. అయితే శోభితకి మాత్రం ఇది మొదటి పెళ్లినే కావడం విశేషం.
శోభితా దూళపాళ తండ్రి నేవీ అధికారి. తెనాలిలో పుట్టి వైజాగ్‌లో పెరిగింది. ముంబయిలో ఉన్నత స్టడీస్ చేసింది. తాను ఎకనామిస్ట్ కావాలనుకుంది. కానీ అనూహ్యంగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అట్నుంచి సినిమాల్లోకి వచ్చింది. అయితే మోడలింగ్ సమయంలో తాను చాలా అవమానాలు ఫేస్ చేసినట్టు తెలిపింది శోభిత. ప్రారంభంలో నల్లగా ఉందని తిరస్కరించారట. ఆ తర్వాత అందులోనూ రాణించి ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఎర్త్ 2013లో కూడా పాల్గొంది.
ఇదిలా ఉంటే మోడలింగ్ అయిపోయాక ఆమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఓ యాడ్ కోసం ఆడిషన్‌కి వెళ్లిందట శోభితా. నల్లగా ఉందని రిజెక్ట్ చేశారట. వెనకాల నిల్చునే బ్యాక్ మోడల్‌గానూ పనికి రాదని అవమానించారట. మరో ఆడిషన్‌కి వెళితే కెమెరా రిపేర్ అయ్యిందని నెక్ట్స్ డే రమ్మన్నారు. ఆ రోజు వెళ్లితే శోభితా కాన్ఫిడెన్స్ ని చూసి షాక్ అయ్యారట. ఈ బ్రాండ్‌కి ఆమె సెట్ కాదని అన్నారట.
ఆమె స్థానంలో ఓ కుక్కని పెట్టారట. కానీ తనకు మాత్రం పారితోషికం కూడా చెల్లించినట్టు తెలిపింది శోభిత. తన స్థానంలో కుక్కని పెట్టుకోవడం చాలా అవమానంగా అనిపించిందని ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో తెలిసింది శోభిత. ఆమె మాటలకు యాంకర్లు సైతం షాక్ అవడం గమనార్హం. అంతేకాదు ఆ బ్రాండ్ ఇమేజ్ కుక్కతో సమానమా? అంటూ సెటైర్లు పేల్చారు. ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.