Sobhita:నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ పై శోభిత దిమ్మతిరిగే రియాక్షన్.. ఇంత ఘాటుగా బదులిచ్చిందేంటి..?

First Published Jun 25, 2022, 7:26 PM IST

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. చైతు, శోభిత ఎఫ్ఫైర్ రూమర్స్ గురించి సమంత పీఆర్ టీం ని బ్లేమ్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వారే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. 

దీనితో సమంత కూడా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఒక అమ్మాయిపై రూమర్స్ వినిపిస్తే కచ్చితంగా నిజం కావాలి.. అదే ఒక అబ్బాయిపై రూమర్స్ వస్తే ఎవరో అమ్మాయి ఈ రూమర్స్ సృష్టించింది అంటారు. మీ పని మీరు చూసుకోండి.. మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి అంటూ సమంత తనపై వస్తున్న ఆరోపణలపై బదులిచ్చింది. 

ఎలాంటి కారణం లేకుండా సెలెబ్రిటీల గురించి ఒక్కోసారి పుకార్లు మొదలైపోతాయి. చైతు, శోభిత గురించి వస్తున్న రూమర్స్ కూడా లాంటివే అనుకోవచ్చు. చైతుపై వస్తున్న రూమర్స్ విషయంలో అతడి సన్నిహితులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభిత ఎందుకు స్పందించడం లేదు అని కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఎట్టకేలకు శోభిత ఈ రూమర్స్ పై స్పందించింది. అది కూడా అలా ఇలా కాదు.. చాలా ఘాటుగా శోభిత ఎఫైర్ రూమర్స్ పై స్పందిస్తూ చెక్ పెట్టింది. శోభిత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో పోస్ట్ చేసింది. 

ఎలాంటి విషయం చెప్పకుండా ఈ వీడియో పోస్ట్ చేసింది శోభిత. అయితే కారణం లేకుండా ఎవ్వరూ మిడిల్ ఫింగర్ చూపించరు. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ కి శోభిత రియాక్షన్ ఇదే అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. 

ఎలా స్పందించినప్పటికీ బోల్డ్ గా శోభిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇకనైనా చైతు, శోభిత పై రూమర్స్ ఆగుతాయోమో చూడాలి. శోభిత హీరోయిన్ అయ్యాక ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు అనే చెప్పాలి. రీసెంట్ గా శోభిత మేజర్ మూవీలో కీలక పాత్రలో నటించింది. 

click me!