కానీ ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్ పై చైతూ కానీ, శోభిత కానీ స్పందించలేదు. ఏది ఏమైనా వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చైతు సమంతని 2017లో వివాహం చేసుకోగా 2021లో విభేదాలతో విడిపోయి అందరికి షాకిచ్చారు. ఇదిలా ఉండగా శోభిత చివరగా పొన్నియిన్ సెల్వన్ 2లో వానతి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది.