తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

ఇక లైఫ్‌లో మల్టీస్టారర్‌ చేయను, ఆవేశంతో ఊగిపోయిన శోభన్‌ బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణతో చేసిన ఆ మూవీనే కారణం ?

Aithagoni Raju | Published : Apr 16, 2025 8:31 AM

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన మల్టీస్టారర్‌ చిత్రాలతోనే ఎదిగారు. ప్రారంభంలో ఆయన చాలా వరకు అలాంటి చిత్రాలే చేశారు.  కానీ ఓ దశలో ఆయన మల్టీస్టారర్‌ చిత్రాలు చేయనంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు పరుచూరి బ్రదర్స్ పై మండిపడ్డారు. మరి దీనికి కారణమేంటి? అసలు ఎక్కడ దెబ్బకొట్టింది? సోగ్గాడు హర్ట్ కావడానికి రీజన్‌ ఏంటనేది చూస్తే.   

15
ఇక లైఫ్‌లో మల్టీస్టారర్‌ చేయను, ఆవేశంతో ఊగిపోయిన శోభన్‌ బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణతో చేసిన ఆ మూవీనే కారణం ?
sobhan babu

శోభన్‌ బాబు సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌. ఆయన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మిళితం చేయరు. ఇంటికెళ్తే సినిమాలను మర్చిపోతారు, సెట్‌కి వెళ్తే ఫ్యామిలీ గురించి పట్టించుకోరు. షూటింగ్‌లో కూడా షెడ్యూల్‌ ప్రకారం వస్తారు.

టైమ్‌కి వెళ్లిపోతారు. సాయంత్రం ఆరు అయ్యిందంటే ఒక్క నిమిషం కూడా ఉండరట. అలాగే మార్నింగ్‌ టైమ్ కి సెట్‌లో ఉంటారు. షూటింగ్‌ కాస్త అటు ఇటు అయినా ఆయన పట్టించుకోరు.   
 

25
Sobhan Babu

తన జీవితం విషయంలోగానీ, మనుషులతో రిలేషన్‌ విషయంలోనూ ఒక పద్ధతిని పాటిస్తారు శోభన్‌ బాబు. సినిమాల్లో పాత్రల విషయంలో కూడా అదే కచ్చితత్వంతో ఉంటారట. అయితే ఓ మల్టీస్టారర్‌ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగింది. తన పాత్రని గొప్పగా చెప్పి, ఆ తర్వాత కట్‌ చేశారు.

దీంతో తన పాత్ర తగ్గిపోయి సైడ్‌ క్యారెక్టర్‌లా మారిపోయింది. మరో హీరో పాత్ర ఎలివేట్‌ అయ్యింది. ఇది ఫైనల్‌గా చూసుకున్న శోభన్‌ బాబు హర్ట్ అయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. ఇకపై మల్టీస్టారర్‌ చేయనంటూ ప్రకటించారు. ఆ రైటర్స్ పై ఫైర్‌ అయ్యారు. మరి ఆ కథేంటో చూస్తే. 
 

35
maha sangramam movie

శోభన్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి చాలా సినిమాలు చేశారు. అలా `మహాసంగ్రామం` అనే చిత్రంలో కలిసి నటించారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. తిరుపతి రెడ్డి నిర్మాత. పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా పనిచేశారు. ఈ మూవీ 1985 ఫిబ్రవరి 14న విడుదలైంది.

అప్పట్లో కోటీ రూపాయల బడ్జెట్‌తో రూపొందిన మూవీ. అంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారీగా ప్రమోషన్స్ చేశారు. తొలి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఈ మూవీలో సూపర్‌ స్టార్‌ కృష్ణ పాత్ర హైలైట్‌ అయ్యింది. శోభన్‌ బాబు పాత్రని డల్‌ చేశారు. చాలా సీన్లు కట్‌ చేశారు. 

45
Sobhan Babu

దీనికి ఓ కారణం ఉంది. ఈ మూవీ సెన్సార్‌ జరిగే టైమ్‌లో అందులో సభ్యునిగా ఒక మిలటరీ అధికారి ఉన్నారట. ఆయన శోభన్‌ బాబు పాత్ర తమ నియమాలకు విరుద్ధంగా ఉందని చాలా సీన్లు కట్ చేయించారట. అలా శోభన్‌ బాబు పాత్ర తగ్గిపోయింది. కానీ ఆ విషయం తెలియక పరుచూరి బ్రదర్స్ తక్కువగా రాశారని భావించి, వాళ్లు కనిపిస్తే చంపేస్తాననే బెదిరించారట.

అంతేకాదు ఆ టైమ్‌లోనే తాను ఇకపై మల్టీస్టారర్ చిత్రాలు చేయనంటూ ప్రకటన కూడా చేశారట. అయితే జరిగిన విషయం తర్వాత తెలియడంతో మరో మూవీ సెట్‌లో పరుచూరి బ్రదర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు తెలిపారట శోభన్‌ బాబు. ఆ గొడవ అప్పటితో సమసిపోయింది. 
 

55
sobhan babu, krishna

ఈ సంఘటనపై, శోభన్‌ బాబు నిర్ణయంపై సూపర్‌ స్టార్‌ కృష్ణ స్పందిస్తూ.. తాను ఈ మూవీ స్క్రిప్ట్ ని మొదట శోభన్‌ బాబు వద్దకే పంపించాను అని, ఆయన పాత్ర సెలక్ట్ చేసుకున్నాకే తాను ఎంపిక చేసుకున్నాను అని చెప్పారట.

ఆ పాత్ర చేయాలని శోభన్‌ బాబు నిర్ణయంచుకున్నాకనే రెండో పాత్రని తాను చేశానని తెలిపారు కృష్ణ. అందులో తన మిస్టేక్‌ ఏం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని ఇందులో ఎవరి తప్పు లేదని భావించి సోగ్గాడు కూల్‌ అయ్యారట.  

read  more: కాలేజీలో దేవుడుగా పిలిపించుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినిమాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌

also read: జైల్ ట్రీట్‌మెంట్‌.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన హీరో సుమన్‌.. జైల్లో ఉన్న వాళ్లంతా తప్పు చేసినవారు కాదా?

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!
Recommended Photos