Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?

Published : Jun 17, 2026, 02:03 PM IST

కృష్ణ, శోభన్ బాబుకు చిరంజీవి గట్టిపోటీ ఇచ్చాడు. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి చిరు చేసిన ప్రయోగాలు అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టాయి. చిరంజీవికి పోటీగా కృష్ణ శోభన్ బాబు సినిమాలు రిలీజ్ చేసినా కొన్ని సందర్భాల్లో ఆయన చేతుల్లో చావు దెబ్బ తినక తప్పలేదు. 

PREV
15
కృష్ణ - శోభన్ బాబులకు పోటీ ఇచ్చిన చిరంజీవి..

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు హీరోలు పోటా పోటీగా సినిమాలు చేస్తూ.. మంచి ఫామ్ లో ఉండగానే.. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గరు హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గట్టిగా నడిచింది. మల్టీ స్టారర్లు చేస్తూ.. కృష్ణ ‌- శోభన్ బాబు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేవారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు మధ్య కూడా యుద్ద వాతావరణం ఉండేది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఫామ్ లో ఉండగానే చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని వెస్ట్రన్ డ్యాన్స్, యాక్షన్ సీన్స్ రుచి చూపించి మాస్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు.

25
చిరంజీవి జోరుకు బ్రేక్స్ వేయడానికి ప్రయత్నాలు

చిరంజీవికి పోటీ ఇవ్వడానికి కృష్ణ, శోభన్ బాబు తమ రూటు మార్చుకోవలసి వచ్చింది. చిరంజీవి జోరుకు బ్రేక్స్ వేయడానికి కృష్ణ శోభన్ బాబు చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కో సారి వారి ప్రయత్నాలు ఫలించినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం చిరంజీవి సినిమాల వల్ల చావు దెబ్బ తినక తప్పలేదు. శోభన్ బాబుకి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండేది. ఎక్కవగా ఆయన కుటుంబ కథా చిత్రాలు చేసేవారు. శోభన్ బాబుతో ఫ్యామిలీ ఓరియోంటెడ్ సినిమాలు చేసిన దర్శకులే చిరంజీవితో పక్కా మాస్ సినిమాలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి దర్శకులలో కోదండరామరెడ్డి కూడా ఒకరు.

35
చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా?

చిరంజీవి ఇండస్ట్రీలో నిలబడి స్టార్ గా మారడానికి కోదండరామిరెడ్డి సినిమాలే కారణం. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛాలెంజ్ సినిమా సంచలన విజయం సాధించింది. రికార్డులు బ్రేక్ చేసింది. ఈమూవీ చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఛాలెంజ్ సినిమా రిలీజ్ కు వారం ముందు శోభన్ బాబు ఇల్లాలు ప్రియురాలు సినిమా రిలీజ్ అయ్యింది. కుటుంబ కథా చిత్రం కావడంతో.. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఛాలెంజ్ రిలీజ్ అయిన తరువాత ఇల్లాలు ప్రియురాలు సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి. ఛాలెంజ్ సినిమాకు పోటీగా శోభన్ బాబు మరో సినిమాను బాక్సాఫీస్ బరిలోకి దింపారు. ఆసినిమా మరేదో కాదు మిస్టర్ విజయ్.

45
కృష్ణ - శోభన్ బాబులను భయపెట్టిన చిరంజీవి..

కానీ ఈసినిమా అనుకన్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇక్క అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఈమూడు సినిమాలకు దర్శకుడు ఒకరే. ఆయన మరెవరో కాదు కోదండరామిరెడ్డి. ఇల్లాలు ప్రియురాలు, ఛాలెంజ్, మిస్టర్ విజయ్ మూడు సినిమాలను ఆయనే డైరెక్ట్ చేశాడు. కానీ ఛాలెంజ్ సినిమా ప్రభావానికి శోభన్ బాబు సినిమాకు చావు దెబ్బ తప్పలేదు. చిరంజీవికి అప్పటికే మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరగడం.. చిరంజీవి సినిమాలకు జనాలు థియేటర్లకు పోటెత్తడంతో.. శోభన్ బాబు, కృష్ణ లకు భయం పట్టుకుంది. వారు కూడా అప్ డేట్ అయ్యి.. కాస్త మాస్ డోస్ పెంచి సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలోనే కృష్ణ సింహాసనం లాంటి సినిమాలు పుట్టుకొచ్చాయి.

55
మాస్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి..

కానీ చిరంజీవి మాత్రం వారిని మించిపోయి సంచలనంగా మారాడు. వరుస విజయాలతో మెగాస్టార్ గా నిలిచాడు. ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను ఆయన బ్రేక్ చేశాడు. ఆస్థాయికి ఎదగడానికి చిరు చాలా కష్టపడ్డాడు. మైఖేల్ జాక్సాన స్టెప్పులను ప్రాక్టీస్ చేసి.. తెలుగువారికి రుచి చూపించాడు. యాక్షన్, ఎమోషన్, క్లాస్ , మాస్ అన్ని రకాల సినిమాలతో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నల ఉంటూ.. ఎన్నో సమస్యల నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడుతూ వస్తున్నాడు చిరంజీవి.

Read more Photos on
click me!

Recommended Stories