సుమన్‌ని దేవుడిని చేసిన శోభన్‌ బాబు నిర్ణయం.. ఒక్క దెబ్బతో అందగాడి కెరీరే మారిపోయిందిగా!

First Published Jul 16, 2024, 12:42 PM IST

సుమన్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు. కానీ ఓ కేసు ఆయన్ని తొక్కేసింది. కానీ సోగ్గాడు శోభన్‌ బాబు పరోక్షంగా సుమన్‌కి లైఫ్‌ ఇచ్చాడు. కెరీర్‌ని మార్చేశాడు. 
 

సుమన్‌ ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోగా రాణించిన నటుడు. ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవికే పోటీ ఇచ్చిన హీరో. సీనియర్‌ నటులంతా ఎదుగుతున్న సమయంలో సుమన్‌ సైతం వారికి పోటీ ఇచ్చాడు. చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ, రాజశేఖర్‌, మోహన్‌బాబు, జగపతిబాబు, అర్జున్‌ వంటి హీరోలంతా ఫామ్‌లో ఉన్న సమయంలోనూ సుమన్‌ పెద్ద స్టార్‌ గా రాణించారు.  

అందం ఆయనకు పెద్ద స్పెషల్‌ ఎట్రాక్షన్‌. పైగా చూడ్డానికి కొంత వరకు చిరంజీవి పోలికలు ఉండటం కూడా విశేషం. మంచి మాస్‌, ఫ్యామిలీ సినిమాలు కూడా చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. అప్పట్లో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. విభిన్నమైన సినిమాలతో విజయాలు అందుకున్నాడు. స్టార్‌ హీరోగా రాణించారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవిని కూడా డామినేట్‌ చేసే స్థాయిలో సుమన్‌ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.  

Latest Videos


Suman Talwar

అయితే ఆ క్రమంలోనే ఆయన పలు కేసుల్లో ఇరుక్కున్నారు. నీలిచిత్రాల కేసు ఆయన్ని బాగా దెబ్బకొట్టింది. తమిళనాడు సీఎం, రౌడీ షీటర్‌, అప్పటి డీజీపీ చేసిన కుట్రకి సుమన్‌ బలయ్యాడు. అది ఆయన కెరీరే తలకిందులు చేసింది. డీజీపీ కూతురు కారణంగా సుమన్‌ చాలా స్ట్రగుల్స్ ఫేస్‌ చేయాల్సి వచ్చింది. కెరీర్‌ పరంగా చాలా డౌన్‌ అయ్యాడు. 

అలాంటి పరిస్థితుల్లో శోభన్‌బాబు.. ఆయనకు మరో లైఫ్‌ ఇచ్చాడు. ఆయన కెరీర్‌ మరో మలుపు తిప్పడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అది ఎలా అనేది చూస్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. నాగార్జున హీరోగా `అన్నమయ్య` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో  వెంకటేశ్వరస్వామి పాత్రకి మొదట శోభన్‌బాబునే అడిగారట. అప్పటికే ఆయన రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. 
 

అనంతరం సుమన్‌ వద్దకు ఈ పాత్ర వెళ్లింది. సుమన్‌ చేయడంతో సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్‌ ఒదిగిపోయాడు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటాడా అనేంతగా పాత్రకి ప్రాణం పోశాడు సుమన్‌. `అన్నమయ్య` సినిమా విజయంలో ఆయన పాత్ర ముఖ్య భూమిక పోషించిందని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాతో సుమన్‌ కెరీరే మారిపోయింది. దేవుడి పాత్రలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. వరుసగా అనేక సినిమాల్లో వెంకటేశ్వరుడి పాత్రలు చేశారు. 
 

ఆ తర్వాత సేమ్‌ కాంబినేషన్‌లో `శ్రీరామదాసు` చిత్రం వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనూ నాగార్జున హీరో. ఇందులో రాముడి పాత్రని పోషించారు సుమన్‌. ఆ పాత్ర కూడా క్లైమాక్స్ లో హైలైట్‌గా నిలిచింది. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్ళింది.

ఇప్పటికీ అడపాదడపా అలాంటి దేవుడి పాత్రలు పోషిస్తూ, వెండితెర దేవుడిగా మారిపోయారు సుమన్‌. అదే శోభన్‌బాబు ఆరోజు `అన్నమయ్య` సినిమా చేసి ఉంటే, సుమన్‌కి ఇలాంటి పాత్రలు రావడానికి టైమ్‌ పట్టేది, దేవుడిగా చూడటం కూడా కష్టమనే చెప్పొచ్చు. 

click me!