`జబర్దస్త్` ని వదిలేసిన సిరి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?.. `జవాన్‌` రేంజ్‌లో మరో సినిమానా.. అదిరిపోయే లైనప్‌

Published : Jul 16, 2024, 10:15 AM IST

`బిగ్‌ బాస్‌` సిరి హన్మంతు.. `జబర్దస్త్` సిరిగా మారింది. యాంకర్‌గా అలరించిన ఆమె ఆ షో వదిలేశాక ఆమె ఏం చేస్తుందనేది సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది.   

PREV
16
`జబర్దస్త్` ని వదిలేసిన సిరి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?.. `జవాన్‌` రేంజ్‌లో మరో సినిమానా.. అదిరిపోయే లైనప్‌

యూట్యూబ్‌ నుంచి గుర్తింపు తెచ్చుకున్న సిరిహనుమంత్‌.. బిగ్‌ బాస్‌ షోతో మరింతగా పాపులర్‌ అయ్యింది. ఇందులో షణ్ముఖ్‌తో ఆమె చేసిన రొమాన్స్, పండించిన కెమిస్ట్రీ బాగా హైలైట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో షో నుంచి బయటకు వచ్చాక సిరికి ఆ క్రేజ్‌ బాగా పనికొచ్చింది. ఆ క్రేజ్‌ని ఆఫర్లు దక్కించుకోవడంలో వాడుకుంది. ఆ విషయంలో సక్సెస్‌ అవుతుంది. 
 

26

అడపాదడపా సినిమాలు చేస్తుంది. వెబ్‌ సిరీస్‌లోనూ మెరుస్తుంది. తన ప్రియుడు శ్రీహాన్‌తో వీడియోస్ కూడా చేశారు. ఇలా సోషల్‌ మీడియా ద్వారా ఎంటర్‌టైన్‌ చేసింది. ఈ క్రమంలో సిరికి `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేసే అవకాశం వచ్చింది. కొన్నాళ్లపాటు ఆమె యాంకరింగ్‌ చేసింది. సౌమ్యరావు స్థానంలో వచ్చిన సిరి.. అంతో ఇంతో అలరించింది. కానీ అనసూయ లేని లోటుని భర్తీ చేయలేకపోయింది. 
 

36

ఈ క్రమంలో సడెన్‌గా జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండు జబర్దస్త్ ల్లో ఒక షోని ఆపేయడంతో సిరి బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు రోజులు ప్రసారం అవుతున్న జబర్దస్త్ కి రష్మి గౌతమ్‌ యాంకరింగ్‌ చేస్తుంది. అయితే షో నుంచి బయటకు వచ్చాక సిరి ఏం చేస్తుంది? ఆమె కెరీర్‌ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో తాజాగా ఓపెన్‌ అయ్యింది సిరి. 
 

46

ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ, ఆమె ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్ట్ ల గురించి బయటపెట్టింది. ఆ మధ్య `జవాన్‌` చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది సిరి. అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాజాగా ఆమె చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యంగా ఉన్నాయి. మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు తెలిపింది సిరి. `జవాన్‌` రేంజ్‌లోనే ఉంటుందని పేర్కొంది. ఆ వివరాలు చెప్పని ఆమె బిగ్‌ ప్రాజెక్ట్ తో రాబోతున్నానని వెల్లడించింది. దీంతోపాటు శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తుందట. మరో కొత్త ప్రాజెక్ట్ లైనప్‌లో ఉందని చెప్పింది. 

56

అలాగే శ్రీహాన్‌, శేఖర్‌ మాస్టర్‌లతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ సారి శ్రీహాన్‌తో రొమాన్స్ చేయడం లేదని, ఆయనకు మరో అమ్మాయితో రొమాన్స్ ఉంటుందని, కొత్తగా ఉంటుందని ట్రై చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నట్టు చెప్పిన సిరి..టీవీ షోస్ గురించి చెబుతూ, ఇంకా ఏం చేయడం లేదు అని, టీవీనా? సినిమానా అనే కన్‌ఫ్యూజన్‌లోనూ ఉన్నానని తెలిపింది. 

66

శ్రీహాన్‌, సిరి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. చాలా రోజులుగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. గతంలో సిరి ఓ వ్యక్తిని ప్రేమించింది. ఆయన ప్రమాదంలో చనిపోయారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత శ్రీహాన్‌ దగ్గరయ్యాడు. అప్పట్నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. లైఫ్‌లో బాగా సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories