స్నేహ భర్తతో డైవర్స్ అంటూ వార్తలు.. దిమ్మతిరిగేలా సమాధానం చెప్పిన హోమ్లీ బ్యూటీ.. ఫోటో హల్‌చల్‌

Published : Nov 12, 2022, 07:18 PM ISTUpdated : Nov 12, 2022, 07:39 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహా సాంప్రదాయానికి పెద్ద పీటవేస్తుంది. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించే ఈ అందాల భామకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె తన భర్తతో దూరంగా ఉంటున్నారనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చింది స్నేహ. 

PREV
16
స్నేహ భర్తతో డైవర్స్ అంటూ వార్తలు.. దిమ్మతిరిగేలా సమాధానం చెప్పిన హోమ్లీ బ్యూటీ..  ఫోటో హల్‌చల్‌

స్నేహా గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. ఆమె వరుసగా ఫోటో షూట్లు చేస్తూ అదరగొడుతుంది. కాస్త హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె తరచూ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. ఆమె పోటోలను నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

26

కొన్ని సందర్భాల్లో గ్లామర్‌ షో విషయంలో డోస్‌ పెంచుతుంది స్నేహా. ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా హాట్‌ షో చేస్తుండటం విశేషం. ఇది హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా వార్తల్లో మెయిన్‌ టాపిక్‌గా మారుతుంది స్నేహా. ఆమె తన భర్త, నటుడు ప్రసన్నకి దూరంగా ఉంటుందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని అంటున్నారు. 
 

36

స్నేహ, ప్రసన్న డైవర్స్ తీసుకోబోతున్నారా? అనే రూమర్స్ కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట డైవర్స్ తీసుకోవడమేంటి? ఇద్దరి మధ్య విభేదాలేంటనేది చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న స్నేహ. తాజాగా స్పందించింది. చెప్పకనే మైండ్‌ బ్లోయింగ్‌ సమాధానం ఇచ్చింది. కేవలం ఒక్క పోస్ట్ తో రూమర్స్ క్రియేటర్స్ కి దిమ్మతిరిగేలా చేసింది. 
 

46

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్నేహ తన భర్త ప్రసన్నతో దిగిన ఫోటోని షేర్‌ చేసింది. భర్తని హగ్‌ చేసుకుని చాలా క్లోజ్‌గా, ప్రేమగా ముద్దు పెడుతున్న పిక్ ని పంచుకుంటూ `ట్విన్నింగ్‌` అంటూ పోస్ట్ పెట్టింది. వీకెండ్‌ సందర్భంగా సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నామనే అర్థంలో స్నేహ ఈ పోస్ట్ ని పెట్టడం విశేషం. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతూ, డైవర్స్ రూమర్స్ చెక్‌ పెట్టిందని చెప్పొచ్చు. 

56

కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే స్నేహ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దల అంగీకారంతో 11మే, 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. వీరంతా ఎంతో ప్రేమగా ఉంటుంటారు. తరచూ పిల్లలు, ఫ్యామిలీతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటారు స్నేహ. 

66

మరోవైపు సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ బలమైన పాత్రల్లో నటిస్తుంది స్నేహ. ఇటీవల తెలుగులో `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించింది. చాలా అరుదుగానే ఆమె సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `డాన్సు జోడీ డాన్సు` షోకి జడ్జ్ గా చేస్తుంది. ఈ షో కోసమే ఆమె గ్లామరస్‌గా ముస్తాబై ఫోటో షూట్లు చేస్తూ ఆయా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories