ఈ సినిమా తర్వాత ఖుషి, నాని, న్యూ, అన్బే అన్బే, ఇసై వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో వాలి, ఖుషి సినిమాలకు మాత్రమే మంచి స్పందన లభించింది. దర్శకుడిగానే కాకుండా నెత్తియడి, కిళక్కు సీమైయిలే, ఆసై వంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించారు. ఆ తర్వాత న్యూ సినిమాతో ప్రధాన పాత్రలో పరిచయం అయ్యారు. తిరుమగన్, వ్యాపారి వంటి సినిమాల్లో నాయకుడిగా నటించారు.