శివాజీ అసలైన గేమ్‌కి పల్లవి ప్రశాంత్‌ బలి.. శివన్న స్కెచ్‌ ముందు నిలవలేకపోతున్న `బిగ్‌ బాస్‌ 7` విన్నర్

Published : Jan 03, 2024, 06:07 PM IST

నటుడు శివాజీ బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లో ఛాణక్యుడి ఆటతీరుతో అదరగొట్టాడు. ఇప్పుడు అదే ఆటని బిగ్‌ బాస్‌ షో అయిపోయాక కూడా చూపిస్తున్నాడు. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటున్నాడు.   

PREV
17
శివాజీ అసలైన గేమ్‌కి పల్లవి ప్రశాంత్‌ బలి.. శివన్న స్కెచ్‌ ముందు నిలవలేకపోతున్న `బిగ్‌ బాస్‌ 7` విన్నర్

బిగ్‌ బాస్‌ తెలుగు 7 దాదాపు అన్ని షోస్‌ లో కంటే టాప్‌లో ఉంది. అత్యధిక రేటింగ్‌ సాధించింది. షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.  కంటెస్టెంట్లు ఈ సారి షోని రంజుగా మార్చారు. దీనికితోడు బిగ్‌ బాస్‌ నియమాలు సైతం మరింత ఆసక్తిని క్రియేట్‌ చేశాయి. ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌ అయ్యారు. అమర్‌ దీప్‌, యావర్‌, శివాజీ బాగా పాపులర్‌ అయ్యారు. వీరితోపాటు శోభా శెట్టి, ప్రియాంకలు సైతం తమక్రేజ్‌ని పెంచుకున్నారు. 
 

27

కానీ బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడంలో చాలా వరకు విఫలమవుతున్నారు. బిగ్‌ బాస్ షో విన్నర్లలో కొందరు మాత్రమే క్లిక్‌ అయ్యారు. చాలా వరకు కనిపించకుండా పోయారు. గతంలో ఎవరికి రాని క్రేజ్‌ ఈ సారి విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కి వచ్చింది. మాస్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ వచ్చింది. రైతు బిడ్డ కి ఈ రేంజ్‌ క్రేజా అని ఆశ్చర్యపోయేలా క్రేజ్‌ రావడం విశేషం. అది ఆయన ఆట తీరు, ఆయన ఫాలోవర్స్ ల మేనేజ్‌మెంట్‌ తీరు అని చెప్పొచ్చు. 
 

37

అయితే ఈ సారి తన క్రేజ్‌ని క్యారీ చేయడంలో పల్లవి ప్రశాంత్‌ విఫలమయ్యాడు. ఫినాలే రోజు జరిగిన సంఘటన వల్ల వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఫ్యాన్స్ చేసిన అల్లర్ల వల్ల ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. పైగా బిగ్‌ బాస్‌ నిర్వహకుల ఆదేశాలను, పోలీసుల ఆదేశాలను వినకుండా ఆయన ర్యాలీగా వెళ్లడంతో గొడవలు జరిగినట్టు ఆరోపిస్తూ పోలీసులు ఆరెస్ట్ చేశారు. జైలుకి పంపించారు. ఈ వివాదం కారణంగా ఆయన సైలెంట్ అయ్యాడు. మీడియాకి దూరంగా ఉంటున్నాడు. తన క్రేజ్‌ని క్యారీ చేయలేకపోతున్నాడు పల్లవి ప్రశాంత్‌. 

47

ఇదే అదనుగా రెచ్చిపోతున్నాడు శివాజీ. హౌజ్‌లోనూ తన తెలివితేటలతో ఆటని మలుపు తిప్పాడు. తన వాళ్లని గెలిపించడంలో, తాను గెలవడంతో సక్సెస్‌ అయ్యాడు శివాజీ. అదే గేమ్‌ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటున్నారు. వివాదాల కారణంగా ప్రశాంత్‌ సైలెంట్‌ అయ్యాడు. మరే ఇతర కంటెస్టెంట్లు కూడా మీడియా ముందుకు రావడం లేదు. 
 

57

ఈ సందర్భాన్ని బలంగా వాడుకుంటున్నాడు శివాజీ. వరుసగా మీడియాలో ఉంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంతేకాదు ఇతరులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు తన పిల్లల గురించి, తన రెండోపెళ్లి విషయం, పెళ్లిళ్ల విషయం బయటపెడుతున్నారు. మరోవైపు రాజకీయాలపై హాట్‌ కామెంట్ చేస్తున్నాడు. 
 

67

ఇలా వరుసగా హాట్‌ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటున్నాడు. ట్రెండింగ్‌గా మారుతున్నాడు. దీంతో ఇప్పుడు శివాజీకి వచ్చిన పాపులారిటీ, క్రేజీ మామూలు కాదని చెప్పొచ్చు. ప్రతి ఆడియెన్స్, ప్రతి ఇంటికి వెళ్లిపోతున్నాడు శివాజీ. తనకు తానుగా క్రేజ్‌ని పెంచుకుంటూ పాపులర్‌ అవుతున్నాడు. 
 

77

శివాజీ ఎత్తులు, పై ఎత్తుల ముందు ఇప్పుడు ఎవరూ నిలవడం లేదు. భారీ మాస్‌ ఫాలోయింగ్‌ వచ్చిన బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌ ప్రశాంత్‌ కూడా నిలవలేకపోతుండటం విచారకరం. ఇదే ఛాణక్యుడి తెలివి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్వరలో శివాజీ ఓ వెబ్‌ సిరీస్‌తో రాబోతున్నారు. దీంతోపాటు సినిమా అవకాశాలు వస్తున్నాయట. త్వరలోనే నటుడిగా బిజీ ఆర్టిస్ట్ కాబోతున్నాడని చెప్పొచ్చు. అంతేకాదు లీడ్‌ రోల్‌ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories