ఖుషి ఆపేద్దాం అనుకున్నారా..నా జీవితంలో ఏం జరిగినా దాని తర్వాతే, హెల్త్ బాగాలేనప్పుడు సామ్ కామెంట్స్

Published : Aug 31, 2023, 07:17 PM IST

సమంత, విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
16
ఖుషి ఆపేద్దాం అనుకున్నారా..నా జీవితంలో ఏం జరిగినా దాని తర్వాతే, హెల్త్ బాగాలేనప్పుడు సామ్ కామెంట్స్

ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

26

మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది. 

36

ప్రస్తుతం సమంత తన హెల్త్ బాగు చేసుకునేందుకు, చికిత్స తీసుకునేందుకు యుఎస్ వెళ్ళింది. దీనితో సమంత ఖుషి చిత్ర ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండడం లేదు. ఖుషి చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సిన భాద్యత విజయ్ దేవరకొండ పైనే పడింది. సమంత మాయోసైటిస్ కారణంగా కొన్ని నెలలపాటు ఈ చిత్ర షూటింగ్ జరగలేదు. దీనితో ఈ మూవీ పై అనేక రూమర్స్ వచ్చాయి. 

46

ఈ చిత్రం ఆగిపోతోందా అనే సందేహాలు కూడా వచ్చాయి. నిర్మాతలకు కూడా ఆలోచన వచ్చినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై తాజాగా దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత కొంతకాలం షూటింగ్ ని దూరం కావడం మమ్మల్ని కూడా బాధపెట్టిన మాట వాస్తవమే. అయితే నేను, విజయ్ దేవరకొండ, నిర్మాతలు సమంతపై నమ్మకంతో ఉన్నాం. అవసరమైన సపోర్ట్ ఇచ్చాం. 

56

సమంత కూడా ఖుషి మూవీ పట్ల ఎంతో డెడికేటెడ్ గా ఉండేది. నా జీవితంలో ఏం జరిగినా అది ఖుషి చిత్రం పూర్తి చేసిన తర్వాతే అని సమంత ఆ టైంలో చెప్పింది అని శివ నిర్వాణ గుర్తు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే సమంత తిరిగి వచ్చాక షూటింగ్ చకచకా సాగింది అని శివ నిర్వాణ అన్నారు. 

 

66

సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. సినిమాలకు సామ్ ఏడాది బ్రేక్ తీసుకుంది. ఖుషి తర్వాత సమంత మరే ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. సమంత ఎలాంటి పాత్రలో అయినా కేవలం క్షణాల్లో కన్విన్స్ చేయగల నటి అంటూ శివ నిర్వాణ ప్రశంసలు కురిపించారు. 

click me!

Recommended Stories