కావ్యకి ఆత్మ అభిమానం ఎక్కువ ఎప్పుడైతే అపర్ణ ఇంటి నుంచి డబ్బులు తీసుకువెళ్తుంది అన్నదో ఆ రోజే నాకు తెలుసు ఈ ఇంటి నుంచి ఒక రూపాయి తీసుకు వెళ్ళదని. అయినా తన కష్టంతో తన పుట్టింటి వారిని కష్టం తీరుస్తానంటే మీకు ఏంటి కష్టం ఇకపై తను తనకు నచ్చిన పని చేస్తుంది తనకి మన అందరి సపోర్ట్ ఉండాలి అంతే అంటూ తీర్పు ఇస్తాడు సీతారామయ్య. కావ్య పీడ విరగడైపోతుంది అనుకునే సమయానికి ముసలోడు వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అని తిట్టుకుంటారు రుద్రాణి,రాహుల్.