మహేష్ బాబు ఇంట ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు, సితార, గౌతమ్ సందడి.. మరి సూపర్ స్టార్ ఎక్కడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సబంధిచిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Sitara and Gautam Celebrate Ganesh Nimajjanam from Superstar Mahesh Babu House JMS

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ.. అప్ డేట్ లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట కూడా వినాయక వేడుకలు ఘనంగా జరిగాయి. 
 

Sitara and Gautam Celebrate Ganesh Nimajjanam from Superstar Mahesh Babu House JMS

మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నమ్రత సితార ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యాయి. తాజాగా తమ ఇంట్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని ఇంటి ఆవరణంలోనే నిమజ్జనం చేసి.. వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహేష్ బాబు స్టార్ కిడ్స్ సితార, గౌతమ్ సందడి చేశారు. 
 


అయితే మహేష్ బాబు ఇంట ఐదురోజు వినాయక పూజలు జరగ్గా..  నిమజ్జన వేడుకలను కూడా అంతే సందడిగా నిర్వహించారు. ఇంటి ఆవరణలోనే జరిగిని వినాయక నిమర్జన కార్యక్రమంలో  మహేష్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన ఇంట్లో ప్రతిష్టించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని తన ఇంటి ఆవరణంలోనే సితార గౌతమ్ నిమజ్జనం చేశారు. 

ఇక ఈ నిమర్జనం వేడుకలలో ఇంట్లో పనిచేసేవారితో పాటు సితార, గౌతమ్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో గౌతమ్ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని ముందు రాగా సితార అలాగే ఇంట్లో పని వారందరూ కూడా తన వెనుకే వస్తూ కనిపించారు. 

ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి ఒక వాటర్ డ్రమ్ లో గణేష్ ను  నిమజ్జనం చేశారు. ఈ వీడియోను నమ్రత శేర్ చేస్తూ.. ణపతి బప్పా మోరియా వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ నోట్ కూడా రాశారు. ఈ వీడియో ను చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యాక్తం చేస్తున్నారు. కాకపోతే ఈ వీడియోలు ఎక్కడా మహేష్ బాబు కనిపించలేదు. 

మహేష్ ఇంట్లో ఉండి కూడా ఈ వేడుకల్లో పాల్గోనలేదా.. లేకుంటే.. ఆయన ఏదైనా పనిమీద వెళ్ళారా.. అని అభిమానులు వెతుక్కుంటున్నారు. మహేష్ బాబు కనిపించి ఉంటే.. ఫ్యాన్స్ ఇంకా ఖుషీ అయ్యేవారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!