సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది తెలుసా..?

Published : Oct 16, 2022, 10:25 AM IST

ఒక్క సినిమాతో అదృష్టం వరించింది మృణాల్ ఠాకూర్ కు. తెలుగులో సీతారామం మూవీతో హీరోయిన్ గా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది బ్యూటీకి. అందం నటనతో తెలుగు ప్రేక్షకులు మనసు దోచిన ఈ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో తన గురించిన విషయాలు పంచుకున్నారు. తన పెళ్ళి గురించి ఆమె ఏన్నారంటే..? 

PREV
19
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది తెలుసా..?
sita ramam hindi total box office five weeks dulquer salmaan mrunal thakur

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచేసిన మృణాల్‌.. అందంలో.. నటనలో ఆకట్టుకుంది. సీతా రామం సినిమాతో మరోసారి బాపూ బొమ్మను ఈ సినిమా ద్వారా గుర్తు చేసింది ఠాకూర్‌. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు అవుతున్నా.. సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న  మృణాల్ కు .. టాలీవుడ్ ఆడియన్స్.. జీవితంలో మర్చిపోలేని హిట్ ను అందించారు. 
 

29

హిట్ కొట్టడంతో కంప్లీట్ గా తన ఫోకస్ ను సినిమాల మీదనే పెట్టింది మృణాల్. ఇప్పట్లో ప్రేమ..పెళ్ళి అనే ఆలోచనలు అస్సలు లేవు అంటోంది. ఏం పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేరా అని ప్రశ్నిస్తుంది సీత, అంతే కాదు తనకు నచ్చిన జీవితం కోసం  కష్టపడతానంటోంది. అంతే కాని.. ఎవరి చేతికిందనో బ్రతకడం తనకు అస్సలు నచ్చదంటోంది మరాఠీ బ్యూటీ. 
 

39

ముంబై లో పుట్టి పెరిగిన మృణాల్ ఠాకూర్.. చిన్నతనం నుంచే మోడ్రన్ గా ఉండటం అలవాటు చేసుకుంది. చదువు తరువాత మోడలింగ్ చేసిన బ్యూటీ.. ఆతరువాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించకుంది.  సినిమాల ద్వారా చాలా నేర్చుకున్నానంటోంది హీరోయిన్. ముఖ్యంగా తనకంటే బాగా నటిస్తున్నవారి నుంచి నేర్చుకోవడం అంటే ఇష్టమట మృణాల్ కు. 

49
Mrunal Thakur

కన్నడ సీరియల్‌ కుంకుమ భాగ్య మృణాల్ కు మొదట మంచి పేరు తీసుకొచ్చింది.  ఈ సీరియర్ దాదాపుగా అన్ని భాషల్లో డబ్‌ అయ్యింది. హిందీ జెర్సీ రీమేక్‌ లో అవకాశం రావడానికి కారణం కూడా ఈ సీరియల్ లో తన నటనే. ఇక హిందీ జెర్సీ  షూటింగ్‌లో ఉండగా సీతారామం ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ టీమ్ నుంచి  పిలుపు రాగానే పరుగున వెళ్లాను.. డైరెక్టర్  హనుగారు కథ చెప్పగానే ఓకే అన్నాను అంటూ కొన్ని జ్ణాపకాలు పంచుకుంది మృణాల్. 
 

59
Mrunal Thakur

వెండితెరపైకి వచ్చాక బుల్లితెరపైకి వెళ్ళడం అంటే అది సాధ్యం కాదు. ముక్యంగా మృణాల్ ఫస్ట్ మూవీ తరువాత అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో సీరియస్ చేయడమని ఆమె తల్లి సలహా ఇచ్చింది. కాని మృణాల్ మంచి అవకాశం కోసం ఓపికగా ఎదురుచూసింది. తన నమ్మకం నిజం అయ్యింది.

69

మహానటి తనకు బాగా నచ్చిన సినిమా అంటుంది మృణాల్. ఈ సినిమా తరువాత సావిత్రిగారి లాంటి పాత్రలో నటించాలనేది ఇష్టంగా మారిందట. అదే టైమ్ లో.. మెల్‌బోర్న్‌ ఫిలిం ఫెస్టివల్‌కు  మహానటి తరఫున డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ వచ్చారు. కీర్తి సురేష్ నటన ఇందులో అద్భుతం.. నాకూ అలాంటి అందమైన పాత్ర చేయాలని ఉందని అశ్విన్‌తో అన్నారట మృణాల్. 
 

79

అనకున్నట్టుగానే వారి ప్రొడక్షన్ నుంచే పిలుపు వచ్చింది. తన కల నెరవేరింది. అలా సీతారామం సినిమాలో సరిగ్గా అలాంటి పాత్రే తనకు కు వచ్చింది. ఈ విధంగా.. వైజయంతీ ఫిలిమ్స్‌లో భాగమయినందకు ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతోంది. 
 

89

ఇక తమిళ, మలయాళ సినిమాల్లోనూ వరుస అవకాశాలు సాధిస్తోంది మృణాల్. ఎక్కడ ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగు సినిమాను మాత్రం వదులుకోను అంటోంది. తనకు లైఫ్ ఇచ్చిన  అశ్వినీదత్‌, స్వప్న.. ఇద్దరికీ రుణపడి ఉంటాను అంటున్నారు. అంతే కాదు  తెలుగులో తప్పకుండా మరిన్ని సినిమాలు చేస్తాను. నేను ఛాలెంజింగ్‌ పాత్రలు కోరుకుంటున్నా అన్నారు మృణాల్ ఠాకూర్. 

99
Mrunal Thakur

దుల్కర్‌ సల్మాన్‌తో నటించడం మంచి జ్ఞాపకం అంటుంది మరాఠీ హీరోయిన్. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం కూడా తనకు ఈ సినిమాలో బాగా కలిసి వచ్చిందట. అంతే కాదు తనకు  కథక్‌ అంటే చాలా  ఇష్టం అంటోంది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో పీపా సినిమాలో నటిస్తుంది మృణాల్.  

Read more Photos on
click me!

Recommended Stories